హిట్ కాంబో రిపీట్?
శివకార్తికేయన్
కమలహాసన్
తమిళసినిమా: కోలీవుడ్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న నటుడు శివకార్తికేయన్. ఈయనకు ఇటీవల భారీ అవకాశాలు వరిస్తున్నాయి. నటుడు కమలహాసన్ బ్యానర్ రాజ్ మల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థలో శివకార్తికేయన్ హీరోగా నటించిన అమరన్ చిత్రం ఆయన కెరీర్‌లో గుర్తిండిపోయే చిత్రం అవుతుంది. అంత సంచలన విజయం సాధించిన చిత్రం అది. ఆ తరువాత మదరాసీ, పరాశక్తి వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో శివకార్తికేయన్ నటించారు. తరాతర్వాత వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇది సైన్‌న్స్ ఫిక్షన్ ఇతివృత్తంతో తెరకెక్కనున్న భారీ కథా చిత్రం అని సమాచారం. చిత్రంలో గ్రాఫిక్స్ సన్నివేశాలు చోటుచేసుకుంటాయని సమాచారం. దీంతో షూటింగ్ ఆలస్యం అవుతుందని తెలిసింది. ఈ గ్యాప్‌లో శివకార్తికేయన్ మరో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని కమలహాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే ఈ కాంబోలో మరో హిట్ గ్యారెంటీ అని చెప్పవచ్చు.


