ఆర్‌ఆర్‌ఆర్‌ ఖాతాలో మరో అరుదైన అవార్డు

Japan Academy Award for RRR Movie - Sakshi

ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 46వ జపాన్‌ అకాడమీ ఫిల్మ్‌ ప్రైజ్‌కు సంబంధించి ‘అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌’ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డు సాధించింది. ‘అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్‌’, ‘టాప్‌గన్‌: మ్యావరిక్‌’ వంటి హాలీవుడ్‌ చిత్రాలను దాటి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఈ జపాన్‌ అవార్డును సాధించడం విశేషం. గత ఏడాది జపాన్‌లో విడుదలైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అక్కడి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే.

ఇక 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌కు బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ‘నాటు నాటు’ పాట (మరికొన్ని విభాగాల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నామినేషన్‌ పోటీలో ఉంది), ‘బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌’ విభాగంలో గుజరాతీ ఫిల్మ్‌ ‘ఛెల్లో షో’, డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘ఆల్‌ దట్‌  బ్రీత్స్‌’, డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ ‘ఎలిఫెంట్‌ విష్పర్స్‌’ ఆస్కార్స్‌ షార్ట్‌ లిస్ట్‌ జాబితాలో ఉన్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘ఛెల్లో షో’లతో కలిపి పది ఇండియన్‌ చిత్రాలు ఆస్కార్‌ రిమైండర్‌ లిస్ట్‌లో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్‌ నామినేషన్స్‌ వెల్లడి కానున్నాయి. మరి.. ఎన్ని ఇండియన్‌ చిత్రాలు నామినేషన్స్‌ దక్కించుకుంటాయో చూడాలి.. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top