ఆస్కార్‌లో మనం

Indian Films Journey In Oscar Awards Race - Sakshi

 అకాడమీ అవార్డ్స్‌... గెలువడం ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రముఖులకు ఓ కల. అకాడమీ అవార్డు సాధించారంటే చాలు తమ జీవితాశయం నెరవేరినట్లే సంబరపడిపోతారు. భారతీయ సినీ ప్రముఖులూ అందుకు మినహాయింపేమీ కాదు. ఆ క్రమంలోనే అద్భుతమైన చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వాటిల్లో కొన్ని ఆస్కార్‌ దాకా వెళ్తున్నాయి కూడా. నాటి మదర్‌ ఇండియా మొదలు నేడు వైట్‌ టైగర్‌ దాకా ఆస్కార్‌లో భారతీయ చిత్రాలు పోటీపడుతూనే ఉన్నాయి. మన దేశం తరపున ఏ చిత్రం  నామినేట్‌ అయినా భారత్‌తో ఆస్కార్‌ అనుబంధం మీద చర్చ సహజమే. 93వ అకాడమీ అవార్డ్స్‌ లైవ్‌  స్టార్‌ మూవీస్, స్టార్‌ వరల్డ్‌ ఛానెల్స్‌లో ఏప్రిల్‌ 26న  ఉదయం 5.30 గంటలకు ప్రసారం కానుండగా, ఈ కార్యక్రమాన్ని అదే రోజు రాత్రి 8.30 గంటలకు పునః ప్రసారం అవుతుంది.  ఈ నేపధ్యంలో మన సినిమాలతో ఆస్కార్‌ కున్న అనుబంధం ఒకసారి పరిశీలిస్తే...

  1. ఆస్కార్‌లో భారతీయ చిత్ర ప్రవేశం 1958లో జరిగింది. మదర్‌ ఇండియా చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంలో పోటీపడింది.  అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో ఇటాలియన్‌ చిత్రం నైట్స్‌ ఆఫ్‌ కబ్రినాకు అవార్డును కోల్పోయింది

     
  2. ఆస్కార్‌ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు అనగానే చాలామంది రక రకాలుగా చెప్తారు కానీ, 1983లో ఓ భారతీయ కాస్ట్యూమ్‌ డిజైనర్‌కు ఆస్కార్‌ లభించిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాంధీ చిత్రానికి గానూ  భాను అథైయా గోల్డెన్‌ ట్రోఫీ అందుకున్నారు. ఇదే చిత్రానికి రవిశంకర్‌ సైతం నామినేట్‌ చేయబడ్డారు.

     
  3. మన దేశానికి ఆస్కార్‌లో లభించిన అరుదైన గౌరవం  మాత్రం సత్యజిత్‌రేకు హానరరీ అకాడమీ అవార్డును 1992లో అందించడమే. ఇప్పటిదాకా ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు సత్యజిత్‌రే మాత్రమే. 
     
  4. భారతీయ కథతో రూపుదిద్దుకున్న బ్రిటీష్‌ చిత్రం స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌ 2008లో ఏకంగా 8 అవార్డులు అందుకుంది. సంగీత దర్శకుడు ఏ ఆర్‌ రెహమాన్‌  ఒరిజినల్‌ సాంగ్, ఒరిజినల్‌ స్కోర్‌ పేరిట రెండు అవార్డులు అందుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్‌.

     
  5.  ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగాలలో నామినేషన్లు పొందిన చిత్రాలుగా మదర్‌ ఇండియా, లగాన్, సలామ్‌ బాంబే మాత్రమే నిలిచాయి.

     
  6. ఈ సంవత్సరం వైట్‌ టైగర్‌ చిత్రానికి బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్‌ లభించింది. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్‌ రావు, ఆదర్శ్‌ గౌరవ్‌ లు దీనిలో నటించారు. మరి ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్‌లో ఏం సాధించనుందో...చూడాల్సి ఉంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top