మంగ్లీ పాట, విజయ్‌ దేవరకొండ డ్యాన్స్‌.. హోలీ స్పెషల్‌ సాంగ్స్‌ విన్నారా? | Here's The List Of 10 Tollywood And Bollywood Holi Theme Video Songs Goes Viral, Watch Videos Inside - Sakshi
Sakshi News home page

Holi Festival Songs In Tollywood: మంగ్లీ పాట, విజయ్‌ దేవరకొండ డ్యాన్స్‌.. హోలీ స్పెషల్‌ సాంగ్స్‌ విన్నారా?

Published Mon, Mar 25 2024 7:56 AM

Holi Festival Songs In Tollywood - Sakshi

సంవత్సరంలో ఘనంగా జరుపుకునే పండుగలలో హోలీ పండుగ ఒకటి. వసంత రుతు శోభకు వర్ణమయంగా, సౌందర్యయుతంగా స్వాగతం పలికే రంగుల పండుగ- హోలీ!  ఈ పండుగను సత్య యుగం నుంచి జరుగుతున్నట్లుగా హిందూ పురాణాలు తెలియజేస్తున్నాయి. హోళి అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. ఈ హోళిని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగుల పండగలో మునిగితేలుతారు.

అందరిలో ఆనందాన్ని ఇచ్చే రంగుల పండుగ హోలీ.. నేడు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, రంగు నీటిని విసురుకుంటూ తమ మధ్య ఉన్న అనుబంధాన్ని సరికొత్తగా చెబుతారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు కలిసి ఆనందంగా రంగుల పండుగ చేసుకుంటారు. హోలీ అంటనే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ జోష్ వస్తుంది. మన ప్రియమైన వారిని అదే రంగుల్లో నింపడం లాంటివి చెస్తూ ఎంతో ఆనందంగా గడుపుతుంటాం. ఇలాంటి సమయంలో అందరిలో జోష్‌ నింపే పాటులు తోడైతే.. ఆ సంతోషం డబుల్‌ అవుతుంది. చాలా సినిమాల్లో హోలీ  ఆధారంగా ఎన్నో పాటలు వచ్చాయి. వాటిలో కొన్ని పండుగ వైభవాన్ని చెబితే మరికొన్ని రంగుల జోష్‌ను నింపాయి. మీ ఇంట జరిగే హోలీకి ఈ పాటలను కూడా జత చేయండి.

నాయకుడు: 1987లో మణిరత్నం దర్శకత్వంలో కమల్‌ హీరోగా వచ్చిన ‘నాయకుడు’ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే.. అందులో  ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ అనే పాట ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పవచ్చు.

రాఖీ: ఎన్​టీఆర్, ఇలియానా జోడీగా నటించిన సినిమా రాఖీ. ఇందులో 'రంగు రబ్బా రబ్బా అంటోంది రంగ్ బర్​సే' అంటూ హోలీ సాంగ్‌తో తారక్‌ దుమ్మురేపాడు. అందులో తన డ్యాన్స్‌తో హోలీ సంతోషాన్ని డబుల్‌ చేశాడు. ప్రతి హోలీ కార్యక్రమంలో ఈ పాట ఉండాల్సిందే.

 జెమిని: వెంకటేశ్‌- నమిత జోడీగా నటించి మెప్పించిన సినిమా ‘జెమిని’. ఈ చిత్రంలో ‘దిల్‌ దివానా.. మై హసీనా..’ పాట నేపథ్యం కూడా హోలీ పండుగ చుట్టే ఉంటుంది.

2017లో హోలీ పండగను మత సామరస్యాలకు అతీతంగా జరుపుకోవాలన్న సందేశాన్ని ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఒక పాటను అప్పటి  ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసింది. అందులో విజయ్ దేవరకొండ నటిస్తే.. ఆ థీమ్‌ను వంశీ పైడిపల్లి డైరెక్ట్‌ చేశారు.

మాస్‌: నాగార్జున హీరోగా వచ్చిన మాస్‌ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ సాంగ్‌ ఎవర్‌గ్రీన్‌ హోలీ పాటగా నిలిచింది. దేవీశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్ అందించిన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

2019లో మంగ్లీ హోలీ నేపథ్యంలో ఓ పాటను ఆలపించింది. ‘ఖతర్నాక్‌ కలర్‌ జల్లురా’ అనే సాగే ఈ పాటలో పల్లెల్లో హోలీని ఎంత సంతోషంగా జరుపుకుంటారో చక్కగా చూపించారు.

రెండేళ్ల క్రితం హోలీ పండుగకు యాంకర్‌ వర్షిణీ ప్రత్యేకంగా రూపొందించిన సాంగ్‌లో తన డ్యాన్స్‌తో దుమ్మురేపింది. ఈ పాట ద్వారా మధుప్రియ తన గాత్రంతో ఆకట్టుకుంది.

సిల్​సిలా : బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన  'సిల్​సిలా' సినిమాలో రంగ్ బర్​సే బీగీ చునర్​వాలీ అనే పాట దేశవ్యాప్తంగా మారుమ్రోగింది. ఈ పాటకు అప్పడు, ఇప్పుడు అనే తేడా ఉండదు. పాట వింటే చాలు డ్యాన్స్‌తో ఊగిపోతారు.

Advertisement
Advertisement