కోటబొమ్మాళి పీఎస్‌ ట్విటర్‌ రివ్యూ.. టాక్‌ ఏంటంటే? | Sakshi
Sakshi News home page

Kotabommali PS Movie: కోటబొమ్మాళి పీఎస్‌ ట్విటర్‌ రివ్యూ.. టాక్‌ ఎలా ఉందంటే?

Published Fri, Nov 24 2023 10:27 AM

Hero Srikanth Kotabommali PS Twitter Review - Sakshi

ఎస్‌ఐ రామకృష్ణగా శ్రీకాంత్‌, కానిస్టేబుల్‌ కుమారిగా శివానీ రాజశేఖర్‌, కానిస్టేబుల్‌ రవిగా రాహుల్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘నాయట్టు’కు ఇది రీమేక్‌గా తెరకెక్కింది. వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించింది. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడు నిర్మించిన ఈ చిత్రం నేడు (నవంబర్‌ 24న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా చోట్ల ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో పడిపోయింది.

సినిమాకు రివ్యూ ఇచ్చిన శ్రీవిష్ణు
దీంతో సినిమా చూసిన జనాలు సోషల్‌ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా ఉందంటున్నారు. శ్రీకాంత్‌ కెరీర్‌లోనే ఇది బెస్ట్‌ చిత్రంగా నిలుస్తుందంటున్నారు. డైలాగ్స్‌ అయితే నెక్స్ట్‌ లెవల్‌లో ఉన్నాయంటున్నారు. హీరో శ్రీవిష్ణు సైతం సినిమాపై రివ్యూ ఇచ్చాడు. 'పోలీసుల్ని పోలీసులే ఛేదించడం.. శ్రీకాంత్‌, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు టెర్రిఫిక్‌గా ఉన్నాయి' అని ఎక్స్‌(ట్విటర్‌)లో రాసుకొచ్చాడు.

ఆ సన్నివేశాలు గూస్‌బంప్స్‌..
డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ సైతం ఈసినిమాకు పాజిటివ్‌ రివ్యూ ఇచ్చాడు. 'శ్రీకాంత్‌, వరలక్ష్మి మధ్య వచ్చే సన్నివేశాలు పిల్లి- ఎలుకల కొట్లాటలా అనిపిస్తుంది. ఈ సన్నివేశాలే ప్రేక్షకుడిని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తాయి. చాలాకాలం తర్వాత శ్రీకాంత్‌గారు గుర్తుండిపోయే పాత్ర చేశారు. అతడి పర్ఫామెన్స్‌ అందరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ఈ థ్రిల్లర్‌ మూవీలో ఎమోషనల్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. అవి అందరికీ కనెక్ట్‌ అవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న వ్యవస్థ గురించి పవర్‌ఫుల్‌ డైలాగులు కూడా ఉన్నాయి. వాటికి నేను చాలా కనెక్ట్‌ అయ్యాను. నిర్మాతల గుండెధైర్యాన్ని మెచ్చుకుని తీరాల్సిందే' అని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

చదవండి: అమర్‌దీప్‌కు ఫిట్స్‌.. తనకు ఆ అనారోగ్య సమస్య ఉందన్న నటుడు

Advertisement
 
Advertisement