గ్రామంలో రహస్యం | Hashtag 418: The Film poster presented by prashant neel | Sakshi
Sakshi News home page

గ్రామంలో రహస్యం

Apr 19 2026 1:05 AM | Updated on Apr 19 2026 1:05 AM

Hashtag 418: The Film poster presented by prashant neel

సూర్య రాజ్‌ వీరబత్తిని, హను రెడ్డి, ప్రీతి పగడాల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్‌ సినిమాకు ‘హ్యాష్‌ట్యాగ్‌ 418 ది ఫిల్మ్‌’ అనే టైటిల్‌ ఖరారైంది. ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో కీర్తన్‌ నాదగౌడ దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శనివారం ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘భయంతో కూడిన గ్రామంలోని మెడికల్‌ కాలేజీ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది.

సైన్స్, మిస్టరీ, మూఢనమ్మకానికీ అర్థం కాని ఒక రహస్యంతో ఇప్పటివరకూ ప్రేక్షకులు చూడని ఓ సరికొత్త కథతో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని యూనిట్‌ పేర్కొంది. శ్రీ వైష్ణవ, శశాంక్‌ పాటిల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: జీజీ వెంకీ.

Advertisement
 
Advertisement
Advertisement