‘శాకుంతలం’ పై గుణశేఖర్‌ ఆసక్తికర ట్వీట్‌ | Gunasekhar Interesting Tweet On Sakunthalam Movie | Sakshi
Sakshi News home page

‘శాకుంతలం’ పై గుణశేఖర్‌ ఆసక్తికర ట్వీట్‌

Oct 12 2020 9:28 PM | Updated on Oct 12 2020 9:56 PM

Gunasekhar Interesting Tweet On Sakunthalam Movie - Sakshi

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ‘శాకుంతలం’ అనే సినిమా సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమకావ్యంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. 'శాకుంతలం'కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను కూడా ఆయన ఇటీవల విడుదల చేశారు. మణిశర్మ మ్యూజిక్‌ మ్యాజిక్‌తో ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా గొప్పతనం తెలియజేస్తూ తాజాగా గుణశేఖర్‌ ఓ ట్వీట్‌ చేశారు.  ఇందులో శకుంతలా నాటకం ఎంత గొప్పదో తెలుపుతూ.. తను ఈ సినిమా రూపొందించడానికి కారణం ఏమిటో తెలిపే ప్రయత్నం చేశారు.

''కావ్యేషు నాటకమ్‌ రమ్యమ్‌
నాటకేషు శకుంతలా!
తత్రాపి చ చతుర్థోంకః
తత్ర శ్లోకచతుష్టయం!!

కావ్య ప్రక్రియలన్నిటిలో నాటక ప్రక్రియ రమ్యమైనది. 
నాటకాలన్నింటిలో శకుంతలా నాటకము రమ్యమైనది. 
ఆ శకుంతలా నాటకములో నాలుగవ అంకము, 
అందులోనూ నాలుగు శ్లోకాలు అత్యంత రమ్యమైనవి.. అని  గుణశేఖర్‌ తన ట్వీట్‌ చేశాడు. 

ఇక శాంకుంతలం సినిమా ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమాలో కథానాయిక ఎవరు నటిస్తారు అనేది ఆసక్తిగా మారింది. గుణశేఖర్ రుద్రమదేవిలో నటించిన అనుష్క ఈ సినిమాలో కూడా నటించనున్నట్టు తొలుత వార్తలు వచ్చాయి. ఈ తర్వాత పూజా హెగ్దే పేరు కూడా వినిపించింది. అయితే తాము పూజాను  అనుకోలేదని నిర్మాత నీలిమ గుణ చెప్పారు. అయితే.. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్ హీరోయిన్ ని అనుకుంటున్నారని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement