మరో సినిమాతో వస్తోన్న గుడ్‌ నైట్‌ హీరో! | Good Night Movie Hero Manikandan Acting In Another Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Manikandan K: గుడ్‌ నైట్‌తో హిట్‌.. మరో సినిమాకు రెడీ అయిన హీరో!

Published Tue, Dec 19 2023 3:43 PM

Good Night Movie Hero Manikandan Acting In Another Movie  - Sakshi

జై భీమ్‌ చిత్రంతో ఫేమస్ అయిన హీరో మణికంఠన్.‌ ఇటీవలే గుడ్‌ నైట్‌ సినిమాతో హిట్ అందుకున్నారు. చిన్న చిత్రంగా విడుదలై ఎంత మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఆయన కొత్త చిత్రానికి రెడీ అయ్యారు. నటి శాన్వి మేఘన నాయకిగా నటిస్తున్న ఇందులో గురు సోమసుందరరాజన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమా కారం పతాకంపై ఎస్‌. వినోద్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజేశ్వర్‌ కలిసామి దర్శకత్వం వస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం కోయంబత్తూర్‌లో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా దర్శకుడు రాజేశ్వర్‌ కలిసామి మాట్లాడుతూ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు వృత్తిపరంగా, కుటుంబ పరంగా ఎదుర్కొనే సవాళ్లను.. ఎదుర్కోవడానికి చేసే సాహసాలను చూపే కథంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ మూవీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటుందన్నారు. 

కోయంబత్తూర్‌లో ఫ్లెక్స్ అనే ముద్రణ కార్యాలయంలో దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక చిరు ఉద్యోగి ఇతి వృత్తంతో సాగే కథ కావడంతో ఈ చిత్రంలో చక్కని వినోదంతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఇది కుటుంబ సమేతంగా ఆదరించే కథాచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి కథను ప్రసన్న బాలచంద్రన్‌, రాజేశ్వర్‌ కాలిసామిలు, కథనం, సంభాషణలను ప్రసన్న బాలచంద్రన్‌ అందించారు. ఈ సినిమాకు సుజిత్‌ సుబ్రహ్మణ్యం ఛాయా గ్రహణం, వైసాగ్‌ సంగీతమందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement