GB Krishna Speech In Aadi Saikumar Black Movie Pre Release Event | Puri Jagannath - Sakshi
Sakshi News home page

Aadi Sai Kumar Black Movie: పూరి వద్ద నేర్చుకున్నవి ఎంతో ఉపయోగపడ్డాయి: డైరెక్టర్‌

May 28 2022 8:29 AM | Updated on May 28 2022 9:21 AM

GB Krishna Speech In Aadi Saikumar Black Movie Pre Release Event - Sakshi

‘‘బ్లాక్‌’ సినిమా టీజర్, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యేలు సుభాష్‌ రెడ్డి, గణేష్‌ గుప్త అన్నారు. ఆది సాయికుమార్, దర్శనా బానిక్‌ జంటగా జీబీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లాక్‌’. మహంకాళి దివాకర్‌ నిర్మించిన ఈ సినిమా శనివారం (మే 28) విడుదలవుతోంది.

GB Krishna Speech In Aadi Saikumar Black Movie Pre Release Event: ‘‘బ్లాక్‌’ సినిమా టీజర్, ట్రైలర్‌ చాలా బాగున్నాయి. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యేలు సుభాష్‌ రెడ్డి, గణేష్‌ గుప్త అన్నారు. ఆది సాయికుమార్, దర్శనా బానిక్‌ జంటగా జీబీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బ్లాక్‌’. మహంకాళి దివాకర్‌ నిర్మించిన ఈ సినిమా శనివారం (మే 28) విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం (మే 27) నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆది మాట్లాడుతూ– ‘‘సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం ‘బ్లాక్‌’. దర్శక, నిర్మాతలు కష్టపడి తీసిన ఈ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అని ఆశాభావం తెలిపారు. 

జీబీ కృష్ణ మాట్లాడుతూ–‘‘పూరి జగన్నాథ్‌ సార్‌ వద్ద నేను నేర్చుకున్న అవుట్‌పుట్స్‌ ‘బ్లాక్‌’కి ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రేక్షకులు మా సినిమా చూసి థ్రిల్‌ అవుతారు’’ అన్నారు. ‘‘మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మా చిత్రం అందరికీ నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు మహంకాళి దివాకర్‌. ఈ వేడుకలో ఎమ్మెల్సీ దయానంద్, తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్త, నటుడు కౌశల్‌ తదితరులు పాల్గొన్నారు.     

చదవండి: 👇
డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్‌ చిట్..

నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement