
లక్ష్మీ కోటేశ్వరరావు, జంపన్న, వివేక్ కూచిభొట్ల, కశికా, గగన్, సాహు గారపాటి
గగన్ బాబు, కశికా కపూర్ హీరో హీరోయిన్లుగా ఏకే జంపన్న దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత వివేక్ కూచిభొట్ల కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత సాహు గారపాటి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
తోట లక్ష్మీ కోటేశ్వరరావు ఈ సినిమా స్క్రిప్ట్‌ని జంపన్నకి అందించారు. అనంతరం గగన్ బాబు మాట్లాడుతూ– ‘‘నా క్యారెక్టర్‌లో అద్భుతమైన భావోద్వేగాలు ఉన్నాయి. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది’’ అని తెలిపారు. ‘‘దర్శకుడు ఈ సినిమా కథ చెప్పగానే, గోల్డెన్ ప్రోడక్షన్స్ బ్యానర్‌ను ఆరంభించి ఈ సినిమా తీస్తున్నాను. దేశం అంతా మాట్లాడుకునేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చెప్పారు లక్ష్మీ కోటేశ్వరరావు. ‘‘ఈ సినిమా కథలో చాలా లేయర్స్ ఉన్నాయి’’ అన్నారు జంపన్న. ఈ సినిమాకు సంగీతం: అనూప్ రూబెన్స్, కెమెరా: వీకే రామరాజు.