అవి ఉన్నంత కాలం ప్రేమ ఎప్పుడు ఓడిపోదు.. 'నిన్నే చూస్తూ' ఆడియో రిలీజ్ | Famous MUsic Director Manisharma Released Ninne Chustu Movie Audio | Sakshi
Sakshi News home page

Ninne Chustu Movie Audio Release: 'నిన్నే చూస్తూ' ఆడియో రిలీజ్ చేసిన మణిశర్మ

Oct 10 2022 5:30 PM | Updated on Oct 10 2022 5:37 PM

Famous MUsic Director Manisharma Released Ninne Chustu Movie Audio - Sakshi

శ్రీకాంత్ గుర్రం, బుజ్జి (హేమలతా రెడ్డి) హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'నిన్నే చూస్తూ'. కె.గోవర్ధనరావు దర్శకత్వంలో.. వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై పోతిరెడ్డి హేమలత రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ  చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా ఆడియోను ప్రముఖ సంగీత  దర్శకుడు మణిశర్మ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ పాటలకు రమణ్ రాథోడ్ సంగీతమందించారు.

చిత్ర నిర్మాత హేమలత రెడ్డి గారు మాట్లాడుతూ.. 'ఈ సినిమా ఆడియోను మణిశర్మ రిలీజ్ చేయడం  చాలా సంతోషంగా ఉంది. కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదు అనే ఆలోచనతో పెద్దలకు ప్రేమికులకు అర్థమయ్యే రీతిలో తెరకెక్కించాం. ఈ పాటలు మాకు కచ్చితంగా మంచి పేరు తీసుకొస్తాయి. ఈ నెల చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేస్తాం.' అని అన్నారు.

చిత్ర దర్శకుడు కె.గోవర్ధనరావు మాట్లాడుతూ..'ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదు. అని చెప్పే ప్రేమకథా చిత్రానికి సీనియర్ యాక్టర్స్ ను సుమన్, సుహాసిని, బాను చందర్, శాయాజి షిండే, కిన్నెర లాంటి వారు పని  చేయడం  చాలా సంతోషంగా ఉంది. అలాగే వీరందరినీ డైరెక్షన్ చేసే అవకాశం కల్పించిన నిర్మాత హేమలత రెడ్డి గారికి కృతజ్ఞతలు' అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement