‘దృశ్యం 2’ అరుదైన రికార్డు, ఇండియన్‌ సినిమాల్లో అత్యధిక రేటింగ్‌

Drishyam 2 Movie Is IMDB Highest Rated Indian Movies In 2021 - Sakshi

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌, మీనాలు లీడ్‌రోల్‌ వచ్చిన చిత్రం దృశ్యం. ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది.  తెలుగు, తమిళంలో కూడా ఈ చిత్రం రీమేక్‌ కాగా అక్కడ కూడా దృశ్యం సూపర్‌ హిట్‌ సాధించి బాక్సాఫీసుకు కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో దర్శకుడు దీనికి సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ మూవీ ఇటీవల ఓటీటీలో విడుదలైన చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అకర్షించింది. దర్శక ధీరుడు రాజమౌళి సైతం ఈ మూవీని చూసి నివ్వెరబోయాడు. ఈ మూవీ దర్శకుడు జీతూ జోసెఫ్‌పై ఆయన ప్రశంసలు వర్షం కురిపించాడు. 

ఇక ఇప్పుడు తెలుగులో కూడా ‘దృశ్యం 2’ రీమేక్‌ అవుతుండ‌గా, ఈ సినిమాకు సంబంధించి వార్తలు తరచూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా దశ్యం అరుదైన రికార్టును సాధించింది. ఐఎండీబీ లెక్క‌ల ప్ర‌కారం ఈ ఏడాది అత్యధిక రేటింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా ‘దృశ్యం 2’ రికార్డు సృష్టించింది. అన్ని వయసు వర్గాల వారు, అంతర్జాతీయ ప్రేక్షకుల ఆధారంగా ఈ మూవీ అంత్యధిక గణాంకాలతో 8.8 రేటింగ్‌తో మిగతా చిత్రాలకంటే ముందంజలో ఉంది. కాగా ఈ చిత్రంలో మోహ‌న్ లాల్, మీనా న‌ట‌న ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top