'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు'.. మరి ఇదేంటో? | Director Sundar C: No Vulgarity In My Movies | Sakshi
Sakshi News home page

'నా సినిమాల్లో డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, ఐటం సాంగ్స్‌ ఉండవు'.. నెట్టింట ట్రోలింగ్‌

Apr 23 2025 4:56 PM | Updated on Apr 23 2025 5:40 PM

Director Sundar C: No Vulgarity In My Movies

'నా సినిమాల్లో అశ్లీలతే ఉండదు. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా నా సినిమాలు ఉంటాయి' అంటున్నాడు దర్శకుడు, నటుడు సుందర్‌.సి. ఈయన ఇటీవలే మదగజరాజ సినిమాతో హిట్టందుకున్నాడు. నిజానికి ఇది 2012లో రావాల్సిన సినిమా. కానీ ఎందుకో విడుదలకు నోచుకోలేదు. విశాల్‌ హీరోగా నటించిన ఈ మూవీ ఎట్టకేలకు ఈ ఏడాది జనవరి 12న విడుదలై విజయం సాధించింది.

డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ ఉండవ్‌
ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈయన తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సుందర్‌. సి (Sundar C) మాట్లాడుతూ.. నా సినిమా ప్రతి ఒక్కరూ చూసేలా ఉండాలని కోరుకుంటాను. అందుకే డబుల్‌ మీనింగ్‌ డైలాగులు రాయను. ఒకవేళ ఏవైనా ద్వంద్వార్థాలు ఉండే డైలాగ్స్‌ కనిపించాయంటే అవి కేవలం ప్రేక్షకులు ఊహించుకుంటున్నవే కానీ నేను మాత్రం ఆ ఉద్దేశంతో రాయలేదు.

ఐటం సాంగ్స్‌ ఉండవ్‌
స్క్రిప్టు రాసే దగ్గరి నుంచి షూటింగ్‌ వరకు ఎక్కడా డబుల్‌ మీనింగ్స్‌కు, అసభ్యతకు చోటు లేకుండా జాగ్రత్తపడతాను. అలా అని నా సినిమాల్లో గ్లామర్‌ లేకుండా ఉండదు. కాకపోతే ఆ గ్లామర్‌ను ఎలా చూపిస్తున్నానన్నది ముఖ్యం. ఉదాహరణకు చీరకట్టుకున్న అమ్మాయిని రకరకాల యాంగిల్స్‌లో ఇంకోలా చూపించొచ్చు. నేను మాత్రం అలాంటి పని చేయను. నేను నా కుటుంబంతో కలిసి చూసేందుకు వీలుగా విజువల్స్‌ ఉండాలని భావిస్తాను. అలాగే నా సినిమాల్లో ఐటం సాంగ్స్‌ ఉండవు.. నా చిత్రాలు ఫ్యామిలీ ఫ్రెండ్లీలా ఉంటాయి అని చెప్పుకొచ్చాడు.

మరి ఇదేంటి సార్‌?
ఇది చూసిన నెటిజన్లు నోరెళ్లబెట్టారు. అతడు రాసిన డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ను, కాస్త ఓవర్‌డోస్‌గా ఉన్న సన్నివేశాలను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేస్తున్నారు. మీరు ఫ్యామిలీ ఫ్రెండ్లీ సినిమాలు తీస్తే.. అరణ్మనై మూవీ (Aranmanai Movie)లో స్విమ్మింగ్‌ పూల్‌ సీన్‌ దేనికుందో మరి?, అంబాలా మూవీలో మద్రాస్‌ టు మధురై ఐటం సాంగ్‌ ఉందిగా.. అరణ్మనైలో తమన్నా, రాశీలతో డ్యాన్స్‌ చేయిస్తూ క్లోజ్‌ షాట్స్‌లో చిత్రీకరించావుగా.. అంటూ పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

సినిమా
ఇకపోతే సుందర్‌.. మెట్టుకుడి, అరుణాచలం, అంబే శివం, లండన్‌, రెండు, అరణ్మనై (నాలుగు భాగాలు), యాక్షన్‌, కాఫీ విత్‌ కాదల్‌, మదగజరాజ వంటి పలు సినిమాలు డైరెక్ట్‌ చేయడంతో పాటు కొన్నింటిలో నటించాడు కూడా! ఈయన ప్రస్తుతం దర్శకుడిగా, నటుడిగా గ్యాంగర్స్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కమెడియన్‌ వడివేలు, కేథరిన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 24న విడుదల కానుంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement