జెనీలియాను టార్చర్ చేసిన డైరెక్టర్‌.. మూడు రాత్రులు నిద్రపోలేదట! | Director Bhaskar Tortured Genelia For Ice Cream Scene In Bommarillu Movie | Sakshi
Sakshi News home page

ఆ సీన్‌ కోసం జెనీలియాను టార్చర్ చేసిన డైరెక్టర్‌.. మూడు రాత్రులు నిద్రపోలేదట!

Oct 18 2023 9:13 AM | Updated on Oct 18 2023 3:48 PM

Director Bhaskar Tortured Genelia For Ice Cream Scene In Bommarillu Movie - Sakshi

జెనిలియా.. తెలుగు ప్రేక్షకులకు నవ్వుల హాసినిగానే బాగా పరిచయం. సిద్ధార్థ్‌తో కలిసి నటించిన ‘బొమ్మరిల్లు’ సినిమా ఆమె కెరీర్‌నే మార్చేసింది. అందులో చలాకి, టింగరితనం గల హాసిని పాత్రలో జెనిలియా ఒదిగిపోయింది. బొమ్మరిల్లు తర్వాత ఎన్నో తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ.. జెనిలియా అనగానే టాలీవుడ్‌ ప్రేక్షకులకు మాత్రం హాసిని క్యారెక్టరే గుర్తుకొస్తుంది. అయితే ఆ పాత్రలో నటించడానికి జెనిలియా చాలా కష్టపడిందట. ఆ సినిమాలో ఓ సీన్‌ కోసం మూడు రాత్రులు నిద్రలేకుండా చేశాడట దర్శకుడు భాస్కర్‌. ఒకనొక దశలో సినిమా చేయలేనని వెళ్లిపోయిందట.

జెనిలియాను ఇబ్బంది పెట్టిన సీన్‌ ఏంటి?
బొమ్మరిల్లు సినిమాలో అర్థరాత్రి వేళ హీరో సిద్ధార్థ్‌తో కలిసి జెనిలియా ఐస్‌క్రీమ్‌ తినడానికి వెళ్తుంది. ఈ సీన్‌ కోసం డైరెక్టర్‌ భాస్కర్‌.. జెనిలియాను అర్థరాత్రి షూట్‌కి రమ్మని చెప్పారట. మొదటి రోజు షూట్‌లో జెనిలియా సరిగా చేయలేదట. నాలుగైదు టేకులు తీసుకున్నా..సరిగా చేయలేకపోవడంతో తిరిగి పంపించారట. ఆ ఒక్క సీన్‌ కోసమే మూడు రోజుల పాటు  ఆమెను ని​ద్ర పోనియకుండా చేశాడట డైరెక్టర్‌.

అల్లు అర్జున్ చెప్పడంతో..
డైరెక్టర్‌ భాస్కర్‌ పెట్టే టార్చర్‌ భరించలేక సినిమా వద్దు అని జెనిలియా వెళ్లిపోయిందట. దాదాపు రెండు రోజుల పాటు షూటింగ్‌కి కూడా రాలేదట.  ఈ విషయం గురించి అల్లు అర్జున్‌కు తెలిసి ఆమెతో మాట్లాడి సినిమాలో నటించేలా చేశాడని తెలుస్తోంది. బన్నీ, జెనిలియా మంచి స్నేహితులు. ఆయన కోరిక మేరకే జెనిలియా ‘బొమ్మరిల్లు’లో నటించింది. జెనిలియా ఇష్టం లేకుండా నటించిన చిత్రమే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. బొమ్మరిల్లు రిలీజ్‌ తర్వాత ప్రతి ఒక్కరు ఆమె గురించే మాట్లాడుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement