ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాదే హీరో: దిల్‌ రాజు

Dil Raju ABout Nephew Ashwin and Anupamas Rowdy Boys - Sakshi

‘‘ఔట్‌ అండ్‌ ఔట్‌ యూత్‌ మూవీ ‘రౌడీ బాయ్స్‌’. చాలా కాలం తర్వాత మా బ్యానర్‌లో వస్తున్న యూత్‌ ఫిల్మ్‌ ఇది’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌తో కలసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన చిత్రం ‘రౌడీ బాయ్స్‌’. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రం టీజర్‌ని విడుదల చేసిన అనంతరం ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ–‘‘రౌడీ బాయ్స్‌’ సినిమాకి హీరో దేవిశ్రీ ప్రసాద్‌. కొత్త వాళ్లతో సినిమా చేస్తున్నప్పుడు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కు రప్పించాలంటే మొదట అందర్నీ మెప్పించేది సంగీతమే. ఆశిష్‌ను హీరోగా లాంచ్‌ చేస్తున్నామని, మ్యూజిక్‌ చేయాలని అడిగితే వారం టైమ్‌ తీసుకుని ఓకే అన్నాడు. దేవిశ్రీ, నా జర్నీలో అన్ని సినిమాలు వేరు.. ఈ ‘రౌడీ బాయ్స్‌’ వేరు.  ఇద్దరి హీరోలకంటే అనుపమా పరమేశ్వరన్‌ పెద్దగా కనిపిస్తుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ, తను బాగా చేసింది. దేవిశ్రీ తర్వాత ఈ సినిమాకి తనే సెకండ్‌ హీరో. దసరాకు సినిమాను విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

‘‘ఇటీవలే విడుదలైన మా సినిమా టైటిల్‌ సాంగ్, ఇప్పుడు విడుదలైన టీజర్‌ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను’’ అన్నారు ఆశిష్‌. ‘‘రౌడీబాయ్స్‌’ లో మొత్తం 9 పాటలు ఉన్నాయి. పాటలన్నీ ఆడియన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటాయి’’ అన్నారు హర్ష. ‘‘రౌడీ బాయ్స్‌’ కి మ్యూజిక్‌ అందించేందుకు ‘దిల్‌’ రాజుగారు అడిగిన వెంటనే ఓకే చెప్పాను. ఆశిష్‌ సినిమాకు మ్యూజిక్‌ అందించడం నా బాధ్యత. ఈ సినిమాకు మరో మ్యూజిక్‌ డైరెక్టర్‌ను తీసుకుని ఉంటే నేను ధర్నా చేసేవాణ్ణి. ‘రౌడీబాయ్స్‌’ సినిమాతో కాలేజీ డేస్‌ను గుర్తుచేసుకుంటారు.. యూత్‌ అంతా కలిసి నవ్వుకుంటూ ఈ సినిమాని ఎంజాయ్‌ చేస్తారు. ఆశిష్‌ నటన చూస్తే తొలి సినిమాకే ఇంత బాగా యాక్ట్‌ చేశాడేంటి? అనిపించింది. ఆశిష్, విక్రమ్‌ పోటాపోటీగా నటించారు’’ అన్నారు దేవిశ్రీ ప్రసాద్‌.

చదవండి: కావ్య కోసం కొట్టుకున్న 'రౌడీ బాయ్స్‌'

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top