బాక్సాఫీస్ వద్ద దురంధర్‌-2 హవా.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్ | Dhurandhar 2 Breaks allu arjun Pushpa 2 record in just 31 days | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Collections: దురంధర్‌-2 హవా.. పుష్ప-2 రికార్డ్ బ్రేక్

Apr 19 2026 10:24 AM | Updated on Apr 19 2026 11:35 AM

Dhurandhar 2 Breaks allu arjun Pushpa 2 record in just 31 days

రణ్‌వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోనే మరో రికార్డ్‌ క్రియేట్ చేసింది. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ పుష్ప-2 వసూళ్లను అధిగమించింది. విడుదలైన 31 రోజుల్లోనే ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 1,749.01 కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించింది.

'ధురంధర్ 2: ది రివెంజ్' ఇండియా వ్యాప్తంగా రూ.1329.31 కోట్లు రాబట్టగా.. ఓవర్‌సీస్‌లో రూ.419.70 కోట్ల వసూలు చేసింది. ఈ వసూళ్లతో రూ.1,742 కోట్లు సాధించిన 'పుష్ప 2' చిత్రాన్ని అధిగమించింది. ఓవరాల్‌గా దురంధర్‌-2 ‍ఇండియాలో అత్యధిక వసూళ్ల జాబితాలో మూడోస్థానం సొంతం చేసుకుంది. తొలి స్థానంలో అమిర్ ఖాన్ దంగల్ ఉండగా.. రెండో ప్లేస్‌లో రాజమౌళి బాహుబలి-2 కొనసాగుతోంది. దురంధర్‌-2 వసూళ్లు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో బాహుబలి-2 రికార్డ్ సైతం బ్రేకయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన  దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాకిస్తాన్ స్పై నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, రాకేష్ బేడి, గౌరవ్ గెరా, డానిష్ పాండోర్, మానవ్ గోహిల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో సారా అర్జున్‌ హీరోయిన్‌గా కనిపించింది.

 

Advertisement
 
Advertisement
Advertisement