దేవర డేట్‌ ఫిక్స్‌  | Jr NTR Upcoming Devara Movie Part 1 New Release Date Fixed, Deets Inside - Sakshi
Sakshi News home page

Devara Release Date: దేవర డేట్‌ ఫిక్స్‌ 

Published Sat, Feb 17 2024 12:36 AM

Devara Movie New Release Date Fixed - Sakshi

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకున్నాడు ‘దేవర’. ఈ ఏడాది అక్టోబరు 10న ‘దేవర’ చిత్రం తొలి భాగం విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్‌’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్‌ అలీఖాన్‌ ఓ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.

నందమూరి కల్యాణ్‌ రామ్, కె. హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా తొలి భాగాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అక్టోబరు 10న సినిమాని విడుదల చేయనున్నట్లు శుక్రవారం వెల్లడించారు మేకర్స్‌. 

Advertisement
 
Advertisement