అసభ్య వ్యాఖ్యలు.. ట్రోలర్స్‌కు దీపిక చురకలు

Deepika Padukone Fires On Troller Who Abuse Her In Social Media - Sakshi

సోషల్‌ మీడియాలో తనపై వస్తున్న ట్రోల్స్‌పై బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనె తనదైన శైలిలో స్పందించారు. ఇటీవల దీపిక సామాజిక మాధ్యమాల్లో తరచూ వేధింపులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఆకతాయిలు దీపికాను టార్గెట్‌ చేసి అసభ్యకరమైనవ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేగాక నేరుగా దీపికాకే మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో తనపై అసభ్య వ్యాఖ్యలు చేస్తున్న ట్రోలర్స్‌పై దీపికా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు పెట్టిన మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్‌ తీసి ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేస్తూ.. ‘వావ్‌! మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు, స్నేహితులు గర్విస్తారు’ అంటూ తనదైన శైలిలో చురకలు అట్టించారు.

అయితే ఆ తర్వాత వెంటనే ఆమె ఇన్‌స్టా స్టోరీని తొలగించారు. ఇటీవల దీపికా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోని ఫొటోలను కూడా డిలీట్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా చివరగా ఆమె మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఛపాక్‌’లో నటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆమె యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ పాత్రలో కనిపించారు. అలాగే హీరో హృతిక్ రోషస్‌తో కలిసి ‘ఫైటర్’తో పాటు, ప్రభాస్ తాజా చిత్రం ‘ఆదిపురుష్‌’ చిత్రాల్లో ఆమె నటించనున్నారు. ప్రస్తుతం ఆమె  భర్త రణవీర్‌ సింగ్‌ నటిస్తున్న కపిల్‌ దేవ్‌ బయోపిక్‌ ‘83’లో నటిస్తున్నారు. ఇందులో కపిల్‌ దేవ్‌గా భార్య రోమిదేవి పాత్రను దీపికా పోషిస్తున్నారు.

(చదవండి: దీపిక ఎందుకిలా చేసింది?: ఫ్యాన్స్‌ కంగారు)
(నేను అలానే పెరిగాను.. ఇప్పుడు మారలేను: దీపికా)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top