Venkatesh Daughter: ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌లో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత

Daggubati Venkatesh Daughter Aashritha In Instagram Rich List - Sakshi

venkatesh daughter ashritha daggubati: హీరో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత అరుదైన రికార్టును సొంతం చేసుకుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ రిచ్‌లిస్ట్‌ జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా ఆశ్రితకే కుకింగ్‌ హ్యాబిట్‌ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్ఫినిటీ ప్లాటర్‌ అనే పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ చేసి అందులో తన చేసే రకరకాల వంటకాల వీడియోలు షేర్‌ చేస్తుంటుంది. ఆమెకు ఇన్‌స్టాలో 13 లక్షలకు పైగా ఫాలోవర్స్‌ కూడా ఉన్నారు. కాగా ఇటీవల హోపర్‌ డాట్‌ కం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబితాను విడుదల చేసింది.

ఇందులో ప్రపంచలోనే అత్యధికంగా సంపాదిస్తున్న వారిలో హాలీవుడ్‌ నటుడు క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఇండియా నుంచి విరాట్‌ కోహ్లి, నటి ప్రియాంక చొప్రా ఉన్నారు. ఇదే జాబితాలో వెంకటేష్‌ కూతురు ఆశ్రిత కూడా చోటు సంపాదించుకుంది. ఈ లిస్టులో ఆశ్రిత ప్రపంచవ్యాప్తంగా 377 స్థానంలో నిలవగా.. ఆసియా మొత్తంలో 27వ ర్యాంకులో ఉంది. భారతీయులు అత్యల్పంగా ఉన్న ఈ జాబితాలో ఆశ్రిత చోటు దక్కించుకోవడం విశేషం. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కో వీడియోకు సుమారు 400 డాలర్లు తీసుకుంటుందట. ​కాగా ఆశ్రిత 2019లో వినాయక రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు స్పెయిన్‌లోని బార్సిలోనాలో సెటిల్‌ అయ్యారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top