మెగా ఫ్యాన్స్‌.. చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ టీజర్‌ వచ్చేసింది! | Chiranjeevi GodFather Teaser Out Now | Sakshi
Sakshi News home page

Chiranjeevi: గాడ్‌ ఫాదర్‌ టీజర్‌ వచ్చేసింది

Aug 21 2022 7:04 PM | Updated on Aug 21 2022 7:14 PM

Chiranjeevi GodFather Teaser Out Now - Sakshi

వెయిట్‌ ఫర్‌ మై కమాండ్‌ బ్రదర్‌ అంటూ సల్మాన్‌కు గైడెన్స్‌ ఇస్తున్నాడు మెగాస్టార్‌. చివర్లో సల్మాన్‌, చిరు ఇద్దరూ కలిసి ఫైట్‌ సీన్‌లో కనిపించారు. ఈ సీన్‌కు థియేటర్లలో విజిల్స్‌ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో వెయిట్‌ చేస్తున్న గాడ్‌ఫాదర్‌ టీజర్‌ రానే వచ్చింది. '20 ఏళ్లు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదు. సడన్‌గా తిరగొచ్చిన ఆరేళ్లలో జనాలలో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు' అన్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఇక్కడికీ ఎవరు వచ్చినా, రాకపోయినా నేను పట్టించుకోను. కానీ అతడు మాత్రం రాకూడదు అంటూ నయనతారను చూపించారు. వెయిట్‌ ఫర్‌ మై కమాండ్‌ బ్రదర్‌ అంటూ సల్మాన్‌కు గైడెన్స్‌ ఇస్తున్నాడు మెగాస్టార్‌. చివర్లో సల్మాన్‌, చిరు ఇద్దరూ కలిసి ఫైట్‌ సీన్‌లో కనిపించారు. ఈ సీన్‌కు థియేటర్లలో విజిల్స్‌ పడటం ఖాయంగా కనిపిస్తోంది.

మొత్తానికి టీజర్‌తోనే ప్రేక్షకుల కడుపు నింపేశాడు డైరెక్టర్‌. పనిలో పనిగా ఈ సినిమా అక్టోబర్‌ 5న రిలీజవుతున్నట్లు ప్రకటించారు. ఇక మోహన్‌ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను కొణిదెల సురేఖ సమర్పణలో ఆర్‌బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. సల్మాన్‌ ఖాన్, నయనతార, పూరి జగన్నాథ్, సత్యదేవ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.

చదవండి: సమంత సెకండ్‌ హ్యాండ్‌, చీప్‌ క్యారెక్టర్‌ అన్నాడు, తట్టుకోలేకపోయా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement