Brahmaji: సమంత సెకండ్‌ హ్యాండ్‌, చీప్‌ క్యారెక్టర్‌ అన్నాడు, తట్టుకోలేకపోయా..

Brahmaji Interesting Comments On Samantha Divorce - Sakshi

కమెడియన్‌గా, నటుడిగా ఎన్నో పాత్రల్లో అలరించాడు నటుడు బ్రహ్మాజీ. చిన్న, పెద్ద అని తేడా లేకుండా దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌ నటుడిగా రాణిస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. 'నేను అన్ని విషయాల్లో దూరను. కానీ మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా నోరు మెదుపుతాను. ఎలా అంటే.. సమంత విడాకులు తీసుకున్నప్పుడు ఓ వ్యక్తి ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు. నాగచైతన్య దగ్గరి నుంచి రూ.250 కోట్లు భరణం తీసుకుని గేమ్‌ ప్లే చేశావు, నువ్వో సెకండ్‌ హ్యాండ్‌ అంటూ చీప్‌గా మాట్లాడాడు. సమంత ఆ కామెంట్‌కు రిప్లై ఇచ్చింది, అది వేరే విషయం. కానీ అతడి మాటలకు కోపమొచ్చి నేనూ స్పందించాను. నీకు సిగ్గు, శరం లేదు. నువ్వు థర్డ్‌ గ్రేడ్‌. అమ్మాయి వ్యక్తిగత విషయంతో నీకేంటి సంబంధం? అన్నాను.

సమంత ముఖం చూడాలన్నా, ఆమెతో మాట్లాడాలన్నా దాదాపు పదేళ్లు పడుతుంది. కానీ ఈ సోషల్‌ మీడియా వల్ల కనీసం ఆమెతో మాట్లాడే అవకాశం వచ్చిందని సంతోషపడు. సరదాగా అమ్మాయిని పొగుడు. యాక్టింగ్‌ నచ్చకపోతే చెప్పు. అంతేకానీ ఆమె వ్యక్తిగత విషయం గురించి మాట్లాడేందుకు నువ్వెవరు? అన్నాను. సమంత ఫ్రెండ్స్‌ కూడా దానిపై రియాక్ట్‌ అవలేదు, కానీ నేను స్పందించాను. దెబ్బతో ఆ కామెంట్‌ పెట్టిన అతడు మళ్లీ ఎప్పుడూ అలా కామెంట్‌ చేయలేదు' అని చెప్పుకొచ్చాడు బ్రహ్మాజీ.

చదవండి: పెళ్లిమండపంలో తల్లికి గాయాలు, అయినా హీరో రెండో పెళ్లి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top