మెగాస్టార్‌ను స‌ర్‌ప్రైజ్ చేసిన సంహిత | Chiranjeevi Appreciate Samhita For Telling Rudramadevi Dialogue | Sakshi
Sakshi News home page

చిరంజీవిని స‌ర్‌ప్రైజ్ చేసిన మ‌న‌వ‌రాలు

Oct 8 2020 8:31 PM | Updated on Oct 8 2020 9:16 PM

Chiranjeevi Appreciate Samhita For Telling Rudramadevi Dialogue - Sakshi

చిన్న‌పిల్ల‌లు ఏది చేసినా ముద్దుగానే ఉంటుంది. అలాంటిది వాళ్లు త‌మ నైపుణ్యాల‌ను ప్ర‌ద‌ర్శిస్తే ఇంకెంత చూడ‌ముచ్చ‌ట‌గా ఉంటుందో.. అందులోనూ సెల‌బ్రిటీల పిల్ల‌లు చేసే ఏ వీడియో అయినా స‌రే ఇట్టే వైర‌ల్ అవుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుష్మిత కుమార్తె సంహిత‌ త‌న క‌ళ‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రినీ అబ్బుర‌పరిచింది. రుద్ర‌మ‌దేవి సినిమాలోని డైలాగ్‌ను గాంభీర్యం త‌గ్గ‌కుండా హావ‌భావాలు ఒలికిస్తూ, అక్ష‌రం పొల్లుపోకుండా చెప్పింది. డైలాగ్ చెప్పే తీరు, ఆ ద‌ర్పం, యాక్ష‌న్ చూసి మెగాస్టార్ స‌ర్‌ప్రైజ్ అయ్యారు. ముద్దుముద్దుగా డైలాగ్ చెప్పిన మ‌న‌వ‌రాలి వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. "1990లో సుష్మిత‌, 2020లో సంహిత ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అచ్చంగా త‌ల్లిలాగే కూతురు" అంటూ చిరు సంతోషం వ్య‌క్తం చేశారు. (చ‌ద‌వండి: సన్యాసిలా ఆలోచించగలనా?)

ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజ‌న్లు మెగాస్టార్ మ‌న‌వ‌రాలా.. మ‌జాకా! అంటూ సంహిత‌ను తెగ‌ పొగిడేస్తున్నారు. కాగా చిరంజీవి ఈ మ‌ధ్యే సినీ ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టి 42 ఏళ్లు పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. 150కి పైగా చిత్రాల్లో న‌టించిన ఆయ‌న తాజాగా "ఆచార్య" సినిమా షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా వ‌చ్చే ఏప్రిల్‌కు పూర్త‌వుతుంది. అనంత‌రం వీవీ నాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో  ‘లూసిఫర్‌’ (మలయాళం)  రీమేక్, మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో ‘వేదాళం’ (తమిళం) రీమేక్‌లో నటించ‌నున్నారు. (చ‌ద‌వండి: 'ఆచార్య' క‌థ‌ వివాదంపై చిత్ర‌యూనిట్ క్లారిటీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement