ఆ రోజే ‘చావుకబురు చల్లగా’.. | Chavu Kaburu Challaga Movie Released On March 19 | Sakshi
Sakshi News home page

ఆ రోజే ‘చావుకబురు చల్లగా’..

Jan 31 2021 6:38 PM | Updated on Jan 31 2021 8:00 PM

Chavu Kaburu Challaga Movie Released On March 19 - Sakshi

ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం

కార్తికేయ, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావుకబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మాతగా జీఏ2 పిక్చర్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ‘బస్తీ బాలరాజు’గా కార్తికేయ, ‘మల్లిక’ పాత్రలో లావణ్యా త్రిపాఠి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర బృందం. మార్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ పోస్టర్‌లో లావణ్య, కార్తికేయ బెక్‌పై కూర్చొని ఉన్నారు. బైక్ వెనకాల కూర్చున్న లావణ్యను టచ్ కాకుండా.. కార్తికేయ బైక్ ట్యాంక్ పై కూర్చొని నవ్వుతూ  డ్రైవ్ చేస్తున్నాడు. మరి కార్తికేయ అలా ఎందుకు బైక్‌ నడపాల్సివచ్చిందో తెలియాలంటే మార్చి 19 వరకు ఆగాల్సింది. ఇక ఈ పోస్టర్‌ని హీరో కార్తికేయ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ 'ఈ మార్చి 19కి చావు కబురు చల్లగా చెప్పడానికి బాలరాజు గాడు, మల్లిక థియేటర్లలోకి వస్తున్నారు. బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయడం, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది' అని ట్వీట్‌ చేశాడు. ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’ విడుదల అవుతున్న నెలలోనే  శర్వానంద్‌ ‘శ్రీకారం’( మార్చి 11), ‘జాతి రత్నాలు’(మార్చి 11), ‘గాలి సంపత్’(మార్చి 11), ‘రంగ్ దే(మార్చి 26)’, అరణ్య(మార్చి26) సినిమాలు విడుదలవుతుండటంతో భారీ పోటీ నెలకొందనే చెప్పాలి. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement