Censor Board Did Not Give Permission For Film 'Disha' Encounter- Sakshi
Sakshi News home page

వర్మకు చుక్కెదురు: ‘దిశ’ సినిమాకు బ్రేక్‌?

Feb 4 2021 4:03 PM | Updated on Feb 4 2021 5:41 PM

Censor Board objection on Disha Encounter movie - Sakshi

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ ఉదంతంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ పేరుతో సినిమా తెరకెక్కించాడు. దీనికి సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్‌ విడుదల చేశాడు. త్వరలోనే విడుదల చేద్దామనుకుంటున్న సమయంలో సెన్సార్ బోర్డ్ ఆయనకు షాక్‌ ఇచ్చింది. ‘దిశ’ ఎన్‌కౌంటర్‌ సినిమాకు  సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. దిశ ఎన్‌కౌంటర్ సినిమాకు అనుమతి ఇవ్వడంపై బోర్డులోని మెజార్టీ సభ్యులు అడ్డు చెప్పారు.

సెన్సార్ ఇవ్వాలో లేదో తేల్చుకోలేకపోయినా నలుగురు సభ్యుల బోర్డ్ బృందం మాత్రం అనుమతి నిరాకరించింది. సెన్సార్‌ బృందం అనుమతి నిరాకరణతో సినిమా రివిజన్ కమిటీ పరిశీలనకు వెళ్లింది. ఈ నేపథ్యంలో 8 సభ్యులు ఉన్న సెన్సార్‌ బోర్డు మళ్లీ సినిమా చూడనుంది. అనంతరం సినిమాపై తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే వాస్తవ సంఘటనలకు దగ్గరగా దిశ ఎన్‌కౌంటర్ సినిమా తీశారని దిశ కుటుంబసభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసులకు కూడా గతంలో ఫిర్యాదు చేశారు. నిందితుల కుటుంబసభ్యులు కూడా పోలీసులను ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement