రామ్‌కు ఫ్లాప్‌ ఇచ్చిన డైరెక్టర్‌తో చై మూవీ! | Buzz: Naga Chaitanya Collaborate with Lingusamy | Sakshi
Sakshi News home page

Naga Chaitanya: ఫ్లాప్‌ ఇచ్చిన డైరెక్టర్‌తో చై మూవీ!

May 20 2026 3:32 PM | Updated on May 20 2026 3:38 PM

Buzz: Naga Chaitanya Collaborate with Lingusamy

ఆనందం, రన్‌, సండైకోళి (పందెం కోడి), పయ్యా (ఆవారా), అంజాన్‌ (సికిందర్‌) వంటి పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు లింగుస్వామి. నిర్మాతగానూ పలు సక్సెస్‌ ఫుల్‌ చిత్రాలను నిర్మించిన ఈయన ఇటీవల మంచి హిట్‌ కోసం ప్రయత్నిస్తున్నారనే చెప్పాలి. సండైకోళి చిత్రంతో విశాల్‌కు సూపర్‌ హిట్‌ చిత్రాన్ని ఇచ్చిన లింగుస్వామి ఇటీవల దానికి సీక్వెల్‌గా పందెం కోడి 2 చిత్రాన్ని చేశారు. అది అంచనాలను అందుకోలేకపోయింది. 

చిన్న గ్యాప్‌ తర్వాత..
ఆ తర్వాత టాలీవుడ్‌ హీరో రామ్‌పోతినేని కథానాయకుడిగా ది వారియర్‌ చిత్రాన్ని చేశారు. కానీ ఈ మూవీ కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో చిన్న గ్యాప్‌ తీసుకున్న ఈయన సంగీత దర్శకుడు విద్యాసాగర్‌ వారసుడిని హీరోగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారు. అయితే ఆ చిత్రం ఏమైందో గానీ తాజాగా నాగచైతన్యతో మూవీ చేయబోతున్నట్లు సమాచారం. 

సినిమా
ఇది మంచి యాక్షన్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని సమాచారం. ఈ మధ్య తండేల్‌ చిత్రంతో మంచి సక్సెస్‌ అందుకున్న నాగ చెతన్య ప్రస్తుతం వృషకర్మ అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత లింగుస్వామి దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తమిళంలో వెంకట్‌ ప్రభు డైరెక్షన్‌లో కస్టడీ సినిమా చేసి చేతులు కాల్చుకున్న చై.. లింగుసామితో సినిమా చేస్తాడా? లేదా? చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement