బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్.. నెల సంపాదన ఎంతో తెలుసా? | Sakshi
Sakshi News home page

Raja Goutham: బ్రహ్మనందం కుమారుడు రాజ గౌతమ్ ఏం చేస్తాడో తెలుసా?

Published Wed, Jun 28 2023 3:35 PM

Brahmanandam Son Raja Goutham Business Earnings Per Month - Sakshi

బ్రహ్మనందం టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. కమెడియన్‌గా ఆయన తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లో బ్రహ్మనందం లేకపోతే ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపు వెయ్యికి పైగా చిత్రాల్లో నటించిన  గిన్నిస్ బుక్‌ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో బ్రహ్మనందం అంటే అంతలా ఫేమస్.. మరీ ఆయన కుమారుడు రాజ గౌతమ్ ఈ విషయంలో సక్సెస్ కాలేకపోయాడు. తండ్రి బాటలో నడిచిన ఇండస్ట్రీలో నిలదొక్కుకొలేకపోయారు. 

(ఇది చదవండి: ఇప్పుడే బ్రేక్‌ ఫాస్ట్ కూడా చేశా.. విడాకులపై గజినీ హీరోయిన్!)

పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాతో గుర్తింపు వచ్చినా అంతగా ఫేమ్ రాలేదు. ఆ తర్వాత బసంతి, చారుశీల, మను లాంటి చిత్రాల్లో కనిపించారు. అలా అడపాదడపా సినిమాలు చేసుకుంటూ వస్తున్న గౌతమ్.. తాజాగా బ్రేక్ అవుట్ అనే సినిమా ద్వారా మన ముందుకు రాబోతున్నాడు. అయితే గౌతమ్‌కు సినిమాల్లో నటించడం అసలు డ్రీమ్ కాదట. మరీ రాజ గౌతమ్ సినిమాలు కాకుండా ఏం చేస్తాడో మీకు తెలుసా? ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. 

కేవలం టైమ్ పాస్ కోసమే సినిమాలు చేస్తుంటాడని టాక్ వినిపిస్తోంది. ఆయన అసలు వృత్తి వ్యాపారం. గౌతమ్‌కు హైదరాబాద్‌లో కమర్షియల్ కాంప్లెక్స్‌లతో పాటు ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలలో పెట్టుబడులు కూడా పెట్టారట. అంతేకాకుండా బెంగళూరులోనూ చాలా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయట. కేవలం వాటి ద్వారానే నెలకు రూ.30 కోట్ల రూపాయిల ఆదాయం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంత సంపాదన వస్తే ఇంకా సినిమాల్లో నటించాల్సిన అవసరమేముంది మీరే చెప్పండి. ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు సినిమాలు చేస్తుంటాడని చెబుతున్నారు అంతే. 

(ఇది చదవండి: అసలు ఈ డిజాస్టర్‌ ఏంటి?.. ఆ సాంగ్‌పై షోయబ్ అక్తర్‌ ఆసక్తికర కామెంట్స్!)

 
Advertisement
 
Advertisement