రిలేషన్‌షిప్‌లో అబ్బాయిలు చేసేది చాలా తప్పు: హీరోయిన్‌ | Bollywood Actress Esha Deol About Red Flags In Relationship | Sakshi
Sakshi News home page

Esha Deol: రిలేషన్‌షిప్‌లో అలా ఉండొద్దు.. మీతో ఉన్నవారిని వదిలేసి పక్కవారిపై...

Sep 13 2024 8:42 PM | Updated on Sep 14 2024 10:21 AM

Bollywood Actress Esha Deol About Red Flags In Relationship

ప్రముఖ నటి హేమమాలిని కూతురు, హీరోయిన్‌ ఈషా డియోల్‌ కొద్ది నెలల క్రితమే విడాకులు తీసుకుంది. 2012లో భరత్‌ తక్తానీని పెళ్లి చేసుకున్న ఈమెకు రాధ్య, మిరాయ అని ఇద్దరు కూతుర్లున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో విడాకులు ప్రకటించారు.

ఓ మంచి తోడు దొరికినా సరే..
విడాకుల తర్వాత ఈషా డియోల్‌ తొలిసారి రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడింది. 'రిలేషన్‌షిప్‌లో మీ పార్ట్‌నర్‌తో సమానంగా ఉండాలి. ఆర్థిక విషయాల గురించి చెప్పట్లేదు. ఇద్దరి లైఫ్‌స్టైల్‌ ఒకటై ఉండాలంటున్నాను. అక్కడ తేడా వచ్చిందంటే మాత్రం మీ బంధంలో ఇబ్బందులు తప్పవు. అయితే అబ్బాయిలకు ఓ మంచి తోడు దొరికినా సరే.. మళ్లీ వేరే అమ్మాయిలపై మనసు పారేసుకుంటారు. ఇది చాలా తప్పు.

ఒక్కదాన్నే రోజంతా..
ఇకపోతే మంచి రిలేషన్‌షిప్‌లో ఫ్రెండ్‌షిప్‌ ఉండాల్సిందే! అప్పుడు నువ్వు ఏం చేయాలన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా కూడా అవతలివారి పర్మిషన్‌ అవసరం ఉండదు. అలాగే మనం చేసే పనికి అడ్డు పడకుండా ఉంటారు. నా విషయానికి వస్తే నా ప్రపంచం నాది. నేను ఒక్కదాన్నే రోజంతా సరదాగా గడిపేయగలను. అలా ఉండటం నాకెంతో ఇష్టం కూడా! నాలాంటివారికి ఆ పర్సనల్‌ స్పేస్‌ ఇవ్వాలి' అని చెప్పుకొచ్చింది.

సినిమాల విషయానికి వస్తే.. 
ఈషా డియోల్‌.. కోయి మేరే దిల్‌సే పూచె, కుచ్‌ తో హై, యువ, ధూమ్‌, కాల్‌, షాదీ నెం.1, నో ఎంట్రీ, జస్ట్‌ మ్యారీడ్‌, హైజాక్‌.. ఇలా ఎన్నో హిందీ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. హీరోహీరోయిన్‌ అనే చిత్రంతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది.

బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement