
సాక్షి,ముంబై: బాలీవుట్ సీనియర్ నటి బిపాసాబసు భర్త కరణ్ సింగ్ గ్రోవర్‌తో మాల్దీవుల్లో వాలిపోయింది. కరణ్ 39వ పుట్టినరోజు సందర్భంగా ఈ జంట అక్కడ ఎంజాయ్ చేస్తోంది. ఈ సందర్భంగా బిపాసా కొన్ని హాట్ ఫోటోలను సోషల్‌మీడియాలో షేర్ చేశారు. సంవత్సరంలో తనకు అత్యంత ఇష్టమైన రెండవ రోజు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి బర్త్‌డే విషెస్ తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ హాట్‌భామ మాల్దీవుల్లో విహరిస్తున్న కొన్ని ఫోటోలను, బర్తడే సెలబ్రేషన్ వీడియోను షేర్ చేశారు. ‘‘లవ్ ఈజ్‌ఇన్‌ద ఎయిర్’’ "నీరు ఆకాశం కలిసే చోట’’ నువ్వూ నేను, మంకీ లవ్ హ్యాష్ ట్యాగ్‌లను జోడిస్తూ, భర్తతో కలిసివున్న ఫోటోలు, స్విమ్ సూట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లవ్ బర్డ్స్‌పై అభినందనలు కురిపిస్తున్నారు అభిమానులు.