రెండో వారం ఎలిమినేషన్‌: శేఖర్‌ భాషా | Bigg Boss Telugu 8: Indian RJ Shekar Basha Entered As 8th Contestant | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: బిగ్‌బాస్‌ హౌస్‌లో రాజ్‌ తరుణ్‌ ఫ్రెండ్‌

Sep 1 2024 8:34 PM | Updated on Sep 17 2024 11:58 AM

Bigg Boss Telugu 8: Indian RJ Shekar Basha Entered As 8th Contestant

హీరో రాజ్‌ తరుణ్‌- లావణ్య కేసులో శేఖర్‌ భాషా పేరు బాగా వైరలయింది. ఈయన అసలు పేరు గుదిమెళ్ల రాజశేఖర్‌. చదివింది ఇంజనీరింగ్‌.. 2005లో జెమిని మ్యూజిక్‌లో వీడియో జాకీగా కెరీర్‌ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే హాయ్‌ బుజ్జి వంటి పిల్లల ప్రోగ్రామ్స్‌తో పాటు మూడువేలకు పైగా షోలలో పాల్గొన్నాడు. తర్వాత రేడియో జాకీగా మారి మరింత పేరు సంపాదించుకున్నాడు.

వెల్‌కమ్‌ ఒబామా సినిమాతో నటుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. వెతికా నేను నా ఇష్టంగా అనే చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. పంచముఖి మూవీలో డైరెక్టర్‌ పాత్ర పోషించాడు. నటుడిగా, దర్శకుడిగా, వ్యాఖ్యాతగా పేరు గడించిన ఈయన రాజ్‌ తరుణ్‌ను పలుమార్లు ఇంటర్వ్యూ చేసిన క్రమంలో అతడికి స్నేహితుడయ్యాడు. ఈ పరిచయంతోనే లావణ్య.. రాజ్‌తరుణ్‌పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ హీరోకు మద్దతుగా నిలబడ్డాడు. ఇప్పుడిలా బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎనిమిదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement