గీతూ జిడ్డు, ఫైమా ఇమ్మెచ్యూర్‌, రేవంత్‌ అయితే..: సుదీప | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 6: బయటకొచ్చేసిన పింకీ.. ఈ రిలేషన్‌ వద్దే వద్దన్న గీతూ!

Published Sun, Oct 16 2022 11:26 PM

Bigg Boss 6 Telugu: Sudeepa Pinky Step Out From BB Show - Sakshi

Bigg Boss Telugu 6, Episode 43: సండేను ఫండే చేసేందుకు నాగార్జున గట్టిగానే ట్రై చేశాడు. టాస్కుల పేరుతో పాటలు, డ్యాన్సులతో ఎపిసోడ్‌ను ఎలాగోలా నెట్టుకొచ్చాడు. ఆరోవారం ఆరో కంటెస్టెంట్‌ను ఎలిమినేట్‌ చేశాడు. మరి ఆ వివరాలన్నీ తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ హైలైట్స్‌ చదివేయండి..

నాగార్జున వచ్చీరాగానే ఆదిరెడ్డి, కీర్తి, రాజ్‌ను సేఫ్‌ చేశాడు. తర్వాత హౌస్‌మేట్స్‌కి స్క్రీన్‌పై బొమ్మలు చూపించి ఆ పాటేంటో గెస్‌ చేయమని గేమ్‌ ఆడించాడు. ఫుల్‌ ఎనర్జీతో ఉన్న కంటెస్టెంట్లు పాట గెస్‌ చేయడమూ దానికి తగ్గట్లు స్టెప్పులేయడమూ చేశారు. ఇదైపోగానే మరో ఇంట్రస్టింగ్‌ గేమ్‌ ఆడించాడు నాగ్‌. కొన్ని డైలాగ్‌ ప్లేట్లు ఇచ్చి ఇది మీకు సెట్టవుతుందా? లేదా మరెవరికైనా సెట్టవుతుందా? చెప్పమన్నాడు.

ముందుగా బాలాదిత్య లేచి... అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప హీరోలు, విలన్లు లేరీ నాటకంలో అన్న డైలాగ్‌ గీతూకు సరిగ్గా సరిపోతుందన్నాడు. సొల్లాపు, దమ్ముంటే నన్ను ఆపు అని సూర్యను హెచ్చరించింది ఇనయ. నా పేరు శివమణి, నాక్కొంచెం మెంటల్‌ అంది ఫైమా. ఒక్కసారి కమిట్‌ అయితే నా మాట నేనే విననని చెప్పింది శ్రీసత్య. నా సావు నేను సస్తా, నీకెందుకు? అని రాజ్‌ను అడిగేసింది గీతూ. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులు అని ఒకరకంగా ఫైమాకు వార్నింగ్‌ ఇచ్చింది సుదీప. మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది అని ఇనయను హెచ్చరించాడు సూర్య.

చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు, మాడిపోతావు అని ఇనయకు వార్నింగ్‌ ఇచ్చాడు శ్రీహాన్‌. నా సావు నేను సస్తా, నీకెందుకు అని ఆదిరెడ్డిని అడిగింది కీర్తి. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే అన్న డైలాగ్‌ను ఒకరికొకరు అంకితమిచ్చుకున్నారు రోహిత్‌, ఆదిరెడ్డి. దమ్ము టన్నులు టన్నులుంది చూస్తావా? అని గీతూను అడిగాడు రాజ్‌. ఒకసారి కమిట్‌ అయితే నా మాట నేనే వినను అని అందరిముందు రోహిత్‌కు స్ట్రాంగ్‌గా చెప్పింది మెరీనా. చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని అర్జున్‌ను బెదిరించాడు రేవంత్‌. చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో, రఫ్ఫాడిస్తా అని రేవంత్‌ను బెదిరించింది వాసంతి. నన్ను కొడుతున్నాడు, పకోడి అని పిలుస్తున్నాడు, ఈసారి నన్ను కొడితే తిరిగి కొడ్తానంది వాసంతి.

తర్వాత గీతూ సేఫ్‌ అయింది. చివరగా బాలాదిత్య, సుదీప మిగలగా.. సుదీప ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌. దీంతో బాలాదిత్య, మెరీనా, వాసంతి కన్నీళ్లు పెట్టుకున్నారు. గీతూ మాత్రం ఏదో ఆలోచిస్తూ.. మనం ఈ హౌస్‌లో మాట్లాడకపోతేనే బాగుంటుంది, బయట వెళ్లాక ఈ బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ రిలేషన్‌ పెట్టుకుందామని బాలాదిత్యతో అంది. తర్వాత స్టేజీ మీదకు వచ్చిన సుదీప.. ఇంటిసభ్యులను కొన్ని కూరగాయల మీనింగ్స్‌తో పోల్చింది.

అల్లం ఎలా వంకరటింకరగా ఉంటుందో గీతూ అలా వంకరటింకరగా నడుస్తుందని చెప్పింది. పచ్చిమిర్చి ఘాటులా రేవంత్‌ది షార్ట్‌టంగ్‌ అంది. ఆదిరెడ్డి కొబ్బరికాయలా పైకి గట్టిగా ఉన్నా లోపల సాఫ్ట్‌గా ఉంటాడంది. అర్జున్‌ కన్‌ఫ్యూజ్‌డ్‌, శ్రీహాన్‌ మాస్క్‌ వెనకాల దాక్కున్నాడు, అంటే పరిస్థితులకు తగ్గట్టుగా అవసరమైనవి చూపిస్తాడు అని పేర్కొంది. రాడిష్‌లా ఇనయను చాలా తక్కువ మంది ఇష్టపడ్తారంది. కానీ ఆమె మనసులో ఏమీ పెట్టుకోదని మెచ్చుకుంది. ఫైమా ఇంకా చిన్నదే కాబట్టి ఇమ్మెచ్యూర్‌ అంది. బద్ధకస్తురాలైన గీతూను జిడ్డుతో పోల్చింది.

చదవండి: చెయ్యి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో.. : వాసంతి
హన్సిక రాయల్‌ వెడ్డింగ్‌, పెళ్లి ఎక్కడో తెలుసా?

Advertisement
 
Advertisement
 
Advertisement