Bigg Boss 6: నేహా ఔట్‌.. అతనే మోసం చేశాడంటూ ఎమోషనల్‌

Bigg Boss 6 Telugu: Neha Chowdary Eliminated, Episode 22 Highlights - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి మూడోవారం నేహా ఎలిమినేట్‌ అయింది. నమ్మినవాళ్లే మోసం చేశారంటూ ఏడుస్తూ బయటకు వచ్చింది. స్టేజ్‌ మీద రాజ్‌ గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. అసలు నేహను మోసం చేసిన వ్యక్తి ఎవరు? రాజ్‌తో ఆమెకు ఉన్న బాండింగ్‌ ఏంటి? ఆమె దృష్టిలో దమ్మున్న ఐదుగురు ఎవరు? ఆదివారం హౌస్‌మేట్స్‌ చేసిన సందడి ఏంటి? ఎలాంటి గేమ్స్‌ ఆడారు? తదితర విషయాలను నేటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం వచ్చిందంటే చాలు.. సందడి మాములుగా ఉండదు. హోస్ట్‌ నాగార్జున కంటెస్టెంట్స్‌తో చిన్న చిన్న గేమ్స్‌ ఆడిస్తూ..చివరుకు ఒకరిని ఎలిమినేట్‌ చేసి పంపిస్తారు. ఈ ఆదివారం కూడా అలానే సందడిగా సాగింది. హౌస్‌మేట్స్‌తో రకరకాలు గేమ్స్‌ ఆడించాడు. 

ముందుగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌తో ‘సుత్తిదెబ్బ’ ఆట ఆడించాడు హోస్ట్‌ నాగార్జున. ఒక్కొక్కరు లేచి నాగార్జున అడిగిన ప్రశ్నలకు సూట్‌ అయ్యే వ్యక్తి ఎవరో చూపించి అతని తలపై సుత్తితో కొట్టాలి. ముందుగా ఆదిరెడ్డిని లేపి ఇంట్లో ఎవరికి ఎక్కువ నోటిదూల ఉంటుందని అడగ్గా.. గీతూ పేరు చెప్పారు. ఆడియన్స్‌ కూడా ఆదిరెడ్డి నిర్ణయం కరెక్టెనని చెప్పారు. హౌస్‌లో బ్రెయిన్‌లెస్‌ ఎవరు? యూజ్‌లెస్‌ ఎవరు? యారగెంట్‌ ఎవరు? గుడ్డి ఎద్దు ఎవరు? అటెన్షన్‌ సీకరు? తదితర ప్రశ్నలకు ఒక్కో కంటెస్టెంట్‌ ఒక్కొక్కరిని చెప్పగా..వాటిలో కొన్నింటికి ఆడియన్స్‌ ఓకే చెప్పి, మరికొన్నింటికి నో చెప్పారు. ముఖ్యంగా రేవంత్‌ విషయంలో హౌస్‌మేట్స్‌ ఒకటి చెబితే..ఆడియన్స్‌ మరొకటి చెప్పారు.దీంతో రేవంత్‌ గాల్లో తేలిపోయాడు.

ఇక ఆ తర్వాత నామినేషన్స్‌లో ఉన్న తొమ్మిది మందికి ఎన్వలప్‌ కవర్స్‌ ఇచ్చి..అందులో  ఎక్కువగా డబ్బులు ఉన్నవారు సేవ్‌ అని అవుతారని చెప్పగా...  శ్రీహాన్‌, గీతూల కవర్స్‌లో ఎక్కువ డబ్బులు రావడంతో ఇద్దరూ సేఫ్‌ అయ్యారు. ఆ తర్వాత హౌస్‌మేట్స్‌లో మరో ఆట ఆడించాడు నాగార్జున. కొన్ని జంతువుల బొమ్మలు ఇచ్చి..వాటిలో ఏవి ఎవరికి ఇస్తారో చెప్పమన్నాడు. దీంతో హౌస్‌మేట్స్‌ ఒక్కొక్కరు ఒక్కో బొమ్మను వేరేవాళ్లకి ఇస్తూ దానికి గల కారణాలు  చెప్పారు.

ఇక నామినేషన్‌లో చివరగా వాసంతి, నేహాలు ఉండగా... వారిద్దరి ఫోటోలను తులాభారంలో ఉంచి ఎవరి బరువు తక్కువగా ఉంటే వాళ్లు ఎలిమినేట్‌ అవుతారని చెప్పాడు. ఇద్దరిలో నేహా ఎలిమినేట్‌ అయింది. నమ్మినవాళ్లే నన్ను ఇక్కడ నిలబెట్టారని ఎమోషనల్‌ అవుతూ నేహా బయటకు వచ్చేసింది. స్టేజ్‌మీదకు రాగానే ఆమె ఏవీ వేసి చూపించారు. అనంతరం ఆమెకు ఓ టాస్క్‌ ఇచ్చాడు నాగార్జున. హౌస్‌లో ఉన్నవారిలో ఐదుగురిని దమ్ము ఉన్న కెటగీరిలో..మరో ఐదుగురిని దుమ్ము కేటగిరీలో పెట్టమని చెప్పాడు.

దుమ్మున్న కేటగిరీలో ఆరుగురిని పెడతానంటూ..ఇనయా, రేవంత్‌​, ఆరోహి, అర్జున్‌, వాసంతి, గీతూ ఫోటోలను పెట్టింది. అన్నంతరం రేవంత్‌ గురించి చెబుతూ..అతని వల్లనే నేను ఎలిమినేట్‌ అయ్యానని చెప్పుకొచ్చింది. ఇక దమ్మున్న కేటగిరీలో..రాజు, చంటి, సుదీప, బాలాదిత్య, ఆదిరెడ్డి, శ్రీహాస్‌, శ్రీసత్య ఫోటోలను పెట్టింది. అనంతరం ఒక్కోక్కరి గురించి చెబుతూ ఎమోషనల్‌ అయింది. ముఖ్యంగా రాజ్‌ విషయంలో చాలా నేహ మరింత ఓపెన్‌ అయింది. ‘రాజ్‌తో నాకు మొదటి నుంచి మంచి బాడింగ్‌ ఉంది. నా జీవితంలోకి గత కొన్నేళ్లుగా ఏ అబ్బాయిని రానివ్వలేదు. కానీ రాజ్‌ ద్వారా నాకు మంచి ఫ్రెండ్‌ దొరికాడు. మేం గ్రేట్‌ ఫ్రెండ్స్‌మి.బయటకు వచ్చాక కూడా మా ఫ్రెండ్‌షిప్‌ కంటిన్యూ అవుతుంది. ‘రాజ్‌ బయటకు వచ్చాక కూడా నేనే నీ బాడీగార్డ్‌’అంటూ నేహా తన బిగ్‌బాస్‌ ప్రయాణాన్ని ముగించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top