Bigg Boss 6 Telugu: 4th Week Nominations List | Bigg Boss 6 Telugu Episode 23 Highlights - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నది వీళ్లే..

Sep 27 2022 10:17 AM | Updated on Sep 27 2022 10:58 AM

Bigg Boss 6 Telugu: 4th Week Nominations Full List Episode 23 - Sakshi

BiggBoss 6, Episode 23  :  బిగ్‌బాస్‌ సీజన్‌-6 మూడోవారం పూర్తిచేసుకొని నాలుగోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక నామినేషన్స్‌ ప్రక్రియ మాత్రం ఈసారి చాలా హాట్‌హాట్‌గా జరిగింది. కొందరు చాలా క్లియర్‌గా పాయింట్స్‌ మాట్లాడుతుంటే, మరికొందరేమో సిల్లీ రీజన్స్‌తో నామినేట్‌ చేసుకున్నారు.  మరి ఈ వారం నామినేషన్స్‌లో ఎంతమంది ఉన్నారన్నది బిగ్‌బాస్‌-6 ఎపిసోడ్‌23 నాటి హైలైట్స్‌లో చదివేద్దాం

నామినేషన్స్‌ ప్రక్రియలో భాగంగా ఇద్దరు సభ్యుల తలపై ఒక్కో టమాటాను పూర్తిగా స్మాష్‌ చేసి తాము ఎందుకు నామినేట్‌ చేస్తున్నారో సరైన కారణం చెప్పాల్సి ఉంటుంది.ఇక ముందుగా శ్రీహాన్‌ ఇనయాను నామినేట్‌ చేస్తూ మరోసారి పిట్ట టాపిక్‌ మాట్లాడాడు. దీంతో వారిద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది.వాడు అంటే తీసుకోలేని వాడు పిట్ట ఎలా చెప్తావ్‌ అని వాదించావ్‌, నిన్ను పేరు పెట్టి పిట్ట అని అనలేదు కదా అని శ్రీహాన్‌ చెప్పగా, అక్కడ ఉన్నది నేను కాబట్టి నన్నే పిట్ట అన్నావ్‌ అంటూ ఇనయా బదులిస్తుంది.

ఆ తర్వాత శ్రీహాన్‌ను నామినేట్‌ చేయడానికి ఇనయా వెళ్లగా, ఆవలింతలు తీస్తూ ఒక్క నిమిషం ఆగు అంటూ శ్రీహాన్‌ హేళన చేస్తాడు. ఒక కొన్ని ప్రశ్నలు అడుగుతా ఆన్సర్‌ చెయ్‌ అని అడగ్గా.. నచ్చితే చెప్తా, లేదంటే లేదు అంటూ శ్రీహాన్‌ అంటాడు. ఆ తర్వాత ఏజ్‌ గురించి చాలాసేపు ఇద్దరి మధ్య డిస్కషన్‌ జరుగుతుంది.

ఇక ఆ తర్వాత ఫైమా తన నామినేషన్స్‌తో ఆరోహికి చుక్కలు చూపించింది. నీ భాష నాకు ప్రాబ్లమ్‌ కాదు, కానీ నువ్వు మాట్లాడే విధానమే ప్రాబ్లమ్‌ అంటూ ఫైమా ఆరోహిని నామినేట్‌  చేస్తుంది. నీ ముందు ఎన్ని కెమెరాలు ఉన్నాయో.. నా ముందు అన్నే కెమెరాలు ఉన్నాయి.. నువ్ ఎంత పెర్ఫామెన్స్ ఇస్తే దానికి మించి ఇస్తా అని ఆరోహికి ఇచ్చిపడేసింది ఫైమా. మొత్తంగా ఈవారం 10మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో కీర్తి, అర్జున్‌లను హోస్ట్‌ నాగార్జున డైరెక్ట్‌గా నామినేట్‌ చేసిన సంగతి తెలిసిందే. 

ఇక ఎవరు ఎవరెవర్ని నామినేట్‌ చేశారన్నది ఓసారి పరిశీలిస్తే..
1.  శ్రీహాన్ -             ఇనయ, రాజ్‌లను నామినేట్‌ చేశాడు. 

2. సుదీప   -            ఇనయ, రేవంత్

3. గీతు     -              ఇనయ, చంటి

4.  వాసంతి    -         రేవంత్, ఆర్జే సూర్య

5. ఆరోహి      -           ఇనయ, రేవంత్

6. శ్రీ సత్య  -              ఇనయ, రేవంత్

7. బాలాదిత్య   -          సూర్య, రేవంత్

8. ఇనయ   -                 సుదీప, శ్రీహాన్

9. చంటి   -                   ఇనయ, గీతు

10. అర్జున్ కళ్యాణ్‌-        రాజ్‌, గీతు

11. ఆర్జే సూర్య -              ఇనయ, వాసంతి

12. రేవంత్‌    -                 సత్య, ఆరోహి

13. రాజ్‌  -                     శ్రీహాన్‌, ఆరోహి

14.  రోహిత్‌ & మెరీనా   -   ఇనయ, ఆర్జే సూర్య

15.  కీర్తి      -                   ఇనయ, రేవంత్

16. ఫైమా   -                   ఆరోహి, సుదీప

17. ఆదిరెడ్డి   -               ఆరోహి, సుదీపలను నామినేట్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement