Bigg Boss 5 Telugu: Siri Gets Evicted From Telugu Bigg Boss House - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ నుంచి సిరి ఎలిమినేట్‌.. ఏడ్చేసిన షణ్నూ

Dec 17 2021 4:15 PM | Updated on Dec 17 2021 5:00 PM

Bigg Boss 5 Telugu: Siri Gets Evicted From Telugu Bigg Boss House - Sakshi

Bigg Boss 5 Telugu,Siri Gets Evicted From Telugu Bigg Boss House: బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో మరో రెండు రోజుల్లో పూర్తి కానుంది. ఆదివారం నాడు ఫినాలే జరగనున్న సంగతి తెలిసిందే. టైటిల్‌ రేసులో ఉన్న ఐదుగురు కంటెస్టెంట్లలో షణ్నూ, సన్నీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అఫీషియల్‌ పోలింగ్‌ ప్రకారం సన్నీ ముందంజలో ఉండగా, షణ్నూ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక నాలుగో స్థానం కోసం సిరి, మానస్‌ల మధ్య పోటీ ఉందని తెలుస్తుంది.

అయితే మరో రెండు రోజుల్లో ఫినాలే ఉండగా బిగ్‌బాస్‌ షాకింగ్‌ డెసీషన్‌ తీసుకున్నట్లు సమాచారం. ఫినాలే స్టేజ్‌పై కాకుండా ముందుగానే బిగ్‌బాస్‌ సిరిని ఎలిమినేట్‌ చేశాడు. దీంతో హౌస్‌ను, షణ్నూని వదిలి వెళ్లలేక సిరి బాగా ఎమోషనల్‌ అయ్యింది.

సిరి ఇంటిని వదిలి వెళ్లడంతో షణ్నూ ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా విడుదల చేసింది. అయితే ఇది ఫేక్‌ ఎలిమినేషన్‌ అని తెలుస్తుంది. ఓ గంట పాటు సిరిని సీక్రెట్‌ రూంలో పెట్టి తర్వాత హౌస్‌లో​కి పంపించాడట. సీజన్‌ పూర్తికానున్న నేపథ్యంలో నిన్నటి ఎపిసోడ్‌లో ఫన్నీ టాస్కులు ఇచ్చిన బిగ్‌బాస్‌ నేడు మరోసారి చివరి నిమిషంలో ట్విస్ట్‌ ఇచ్చినట్లు తెలుస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement