Bigg Boss 5 Telugu: ఎనిమిదో కంటెస్టెంట్‌గా జెస్సీ

Model Jaswanth Padala In Bigg Boss 5: పలు యాడ్స్‌లో నటించిన మోడల్ జశ్వంత్ పడాల(జెస్సీ) పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ స్టైలిష్ లుక్స్‌తో హౌస్‌లో అడుగు పెట్టిన అతడు బిగ్‌బాస్ షో ద్వారా చాలా తొందరగానే ప్రేక్షకులకు అందులోనూ అమ్మాయిలకు కనెక్ట్ అవుతాడని చెప్పవచ్చు. మోడలింగ్ రంగంలో పలు అవార్డులు అందుకున్న ఇతడు ఎంత మంచివాడవురా సినిమాతో నటనారంగంలోకి కూడా ప్రవేశించాడు. బిగ్‌బాస్ ఐదో సీజన్‌లో ఎనిమిదో కంటెస్టెంట్‌గా అడుగు పెట్టిన జెస్సీ.. సింగిల్ చిన్నోడే లవ్వులో పడ్డాడనే పాటతో ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ హౌస్‌లో అతడు నిజంగానే లవ్‌లో పడతాడా? అన్నది వేచి చూడాల్సిందే!