బిగ్‌బాస్‌: నాగ్‌పై అభిజిత్ ఫ్యాన్స్‌ ఫైర్

Bigg Boss 4 Telugu: Trolling On King Nagarjuna - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ట్రోఫీ గెలుచుకునేందుకు ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్ప‌టికీ కంటెస్టెంట్లు ఎవ‌రి ఆట వాళ్లు ఆడ‌టం లేద‌న్న విష‌యం నాగార్జున కంట్లో ప‌డింది. అంతేకాక బెస్ట్ కెప్టెన్‌గా హారిక‌ను‌, వ‌ర‌స్ట్ కెప్టెన్‌గా అరియానాను ఎన్నుకోవ‌డాన్ని కూడా ఆయ‌న స‌మ‌ర్థించ‌లేదు. దీంతో హారిక‌ను క‌న్ఫెష‌న్‌ రూమ్‌లోకి పిలిచి నువ్వు బెస్ట్ కెప్టెన్ కాద‌ని తేల్చి చెప్పారు. ఈ మేర‌కు ఈ వారమంతా ఆమె చేసిన త‌ప్పులను వీడియోల మీద వీడియోలు వేసి మ‌రీ క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు. మోనాల్ వ‌ల్ల కెప్టెన్ అయిన నువ్వు అభిజిత్ కోసం ప‌ని చేశావని నిందించారు. అభి మీద ఫేవరెటిజ‌మ్ చూపించావ‌ని విమ‌ర్శించారు. బిగ్‌బాస్ షోలో గెల‌వాలంటే నీ గేమ్ నువ్వు ఆడాల్సిందే అని ఆమెకు స‌ల‌హా ఇచ్చారు.

ఇద్ద‌రి త‌ప్పులే క‌నిపించాయా?
మ‌రోవైపు బిగ్‌బాస్ ఇచ్చిన‌ టాస్కులు ఆడ‌లేద‌ని అభిజిత్ మీద‌ మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా చూపించారు. గేట్లు ఎత్తి పంపించేస్తాన‌ని బెదిరించారు. ఈ క్రమంలో అభి కాస్త ఎమోష‌న‌ల్ అయ్యి మోకాళ్ల మీద కూచుని త‌న త‌ప్పును క్ష‌మించ‌మ‌ని అభ్య‌ర్థించారు. అయితే నాగార్జున ఈ ఇద్ద‌రి వీడియోలు మాత్ర‌మే చూపించి క్లాస్ పీకడం నెటిజ‌న్ల‌కు మింగుడు ప‌డ‌లేదు. కావాల‌నే హారిక‌, అభిజిత్‌ను నాగ్ టార్గెట్ చేశార‌ని  విశ్వ‌సించారు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా నాగ్ తీరును త‌ప్పుప‌డుతున్నారు. (చ‌ద‌వండి: మోనాల్‌తో లింక్ చేయ‌కండి: అభి వేడుకోలు)

నాగ్ సినిమాను అట్ట‌ర్ ఫ్లాప్ చేస్తాం
అస‌లు సిస‌లు ఫేవరెటిజ‌మ్ చూపించేది నాగార్జునే అని దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయ‌న క‌ళ్ల‌కు ఎవ‌రి త‌ప్పులూ క‌నిపించ‌డం లేదా అని క‌డిగిపారేశారు. ఆయ‌న న‌టించిన‌ వైల్డ్ డాగ్ సినిమాను అట్ట‌ర్‌ ఫ్లాప్ చేస్తామ‌ని ప్ర‌తిజ్ఞ పూనుతున్నారు. ఈ ట్రోలింగ్ చూసిన నాగ్ అభిమానులు అగ్గి మీద గుగ్గిల‌మ‌వుతున్నారు. ఓ మామూలు కంటెస్టెంటు కోసం స్టార్ హీరో నాగ్‌ను అన్నేసి మాట‌లంటారా? అని గ‌ర‌మ‌వుతున్నారు. ఉన్న మాట చెప్పినందుకు ఎగిరెగిరిప‌డ‌తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మీరు ఎంత‌ నెగెటివ్‌ ట్రెండ్ చేసినా మా కింగ్‌కు అది గ‌డ్డ ప‌ర‌క‌తో స‌మానం అని ఏకిపారేస్తున్నారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: టాప్ 5 కంటెస్టెంట్లు వీళ్లే)

అప్పుడు నాని, ఇప్పుడు నాగ్‌
నిజానికి నాగార్జున‌ కంటెస్టెంట్ల త‌ప్పుల‌ను ఎత్తి చూపి వారిని చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశారు. ఈ వారంలో ఎవ‌రైతే దిద్దుకోలేని త‌ప్పులు చేశారో, వాటినే ప్ర‌స్తావిస్తూ ఆ త‌ప్పు మ‌ళ్లీ జ‌ర‌గ‌కుండా చూసుకోమ‌ని స‌ల‌హా ఇచ్చారు. అది త‌మ మంచి కోరే చెప్పార‌న్న విష‌యం హారిక‌, అభిజిత్‌ల‌కు అర్థ‌మైంది కూడా. కానీ వాళ్ల‌‌ అభిమానులే అన‌వ‌స‌రంగా రెచ్చిపోయి నాగ్‌తో పెట్టుకుంటున్నారు. నోటికొచ్చిన‌ట్లుగా విమ‌ర్శిస్తున్నారు. కాగా రెండో సీజ‌న్‌లో కౌశ‌ల్ మండా అభిమానులు హోస్ట్‌ నానిని విప‌రీతంగా ట్రోల్ చేశారు. ఈ వ్య‌తిరేక‌త‌ను త‌ట్టుకోలేక నాని మ‌రోసారి బిగ్‌బాస్ షోనే చేయ‌న‌ని క‌రాఖండిగా చెప్పేశారు. ఈ సీజ‌న్‌లో అభిజిత్ కోసం ఏకంగా నాగార్జున‌నే ట్రోల్ చేస్తున్నారు. మ‌రి ఈ ప‌రిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాలి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

11-01-2021
Jan 11, 2021, 20:25 IST
'నువ్వు గెలిస్తే నాకు ల్యాప్‌టాప్‌, బైక్‌ కొనివ్వాలి, నేను గెలిస్తే నీక్కూడా ఆ రెండు కొనిపెడతా' ఇది ఎక్కడో విన్నట్లుంది...
09-01-2021
Jan 09, 2021, 10:30 IST
అప్పటిదాకా చిన్న చిన్న పాత్రల్లో నటించిన సయ్యద్‌ సోహైల్‌కు తెలుగు బిగ్‌బాస్‌-4 సీజన్‌తో ఒక్కసారిగా ఎనలేని గుర్తింపు వచ్చింది. ‘కథ...
29-12-2020
Dec 29, 2020, 00:00 IST
ఇద్దరమ్మాయిలు.. అలేఖ్య హారిక, అరియానా గ్లోరి. ఇద్దరూ బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో ఫైనల్స్‌కు చేరుకున్నారు. అందరి దృష్టిని తమ వైపు నిలుపుకున్నారు. ఇద్దరూ జీవితంలోని...
28-12-2020
Dec 28, 2020, 08:50 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ విజేతగా మిస్టర్‌ కూల్‌ అభిజిత్‌ ట్రోఫీని ఎగరేసుకుపోయాడు. ఎలాంటి పరిస్థితినైనా డీల్‌ చేయగలిగే నైపుణ్యం, హుందాగా...
27-12-2020
Dec 27, 2020, 11:06 IST
బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. సాధారణ వ్యక్తులుగా ఇంట్లోకి...
27-12-2020
Dec 27, 2020, 08:54 IST
హుస్నాబాద్‌: బుల్లితెర వీక్షకులను అలరించిన తెలుగు రియాల్టీ షో బిగ్‌బాస్‌ సోహైల్‌కు శనివారం రాత్రి హుస్నాబాద్‌ పట్టణంలో అభిమానులు ఘన...
26-12-2020
Dec 26, 2020, 13:25 IST
మోనాల్‌ గజ్జర్‌.. బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన పేరు ఇది. తొలుత అభిజిత్‌తో సన్నిహితంగా ఉండటం.. ఆ...
23-12-2020
Dec 23, 2020, 16:11 IST
బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను చూసి జనాలు పెదవి విరిచారు. ముక్కూమొహం తెలీని వాళ్లను హౌస్‌లోకి పంపించారేంటని విమర్శలు గుప్పించారు....
23-12-2020
Dec 23, 2020, 10:39 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందించింది. ఆటలు, పాటలు, అలకలు, గొడవలు, కోపాలు, బుజ్జగింపులు, ప్రేమ, గాసిప్స్‌...
23-12-2020
Dec 23, 2020, 04:59 IST
బిగ్‌ స్క్రీన్‌లో నటించాలి. బిగ్‌ హౌస్‌లో జీవించాలి. రెండూ తెలిసిన కుర్రాడు అభిజీత్‌. సహజంగానే స్ట్రాంగ్‌. ‘రియాలిటీ’తో.. మరింత స్ట్రాంగ్‌ అయ్యాడు. విజేతగా నిలిచాడు. ‘ఈ...
22-12-2020
Dec 22, 2020, 15:56 IST
అభి-హారికల మధ్య కూడా ఏదో నడుస్తుందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
22-12-2020
Dec 22, 2020, 14:28 IST
బుల్లితెర ప్రేక్షకులను 106 రోజులపాటు అలరించిన బిగ్‌ రియాల్టీ రియాలిటీ షో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కు శుభం కార్డు పడింది....
22-12-2020
Dec 22, 2020, 13:39 IST
తెలుగు బుల్లితెరపై 106 రోజులు వినోదాన్ని అందించిన బిగ్‌బాస్‌ సీజన్‌ 4 డిసెంబర్‌ 20న శుభంకార్డు పడిన విషయం తెలిసిందే....
22-12-2020
Dec 22, 2020, 04:24 IST
క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌తో ఉద్యోగంలో చేరి ఉంటే అభిజీత్‌ అనే ఒక నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యే వాడే కాదేమో!
21-12-2020
Dec 21, 2020, 11:08 IST
బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సేపై సోషల్‌ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ నడుస్తోంది. హౌజ్‌లోనూ, బయట కూడా అతను...
21-12-2020
Dec 21, 2020, 09:16 IST
చిరంజీవి ఎదుట తన మనసులో మాటను సోహైల్‌ బయటపెట్టాడు.
21-12-2020
Dec 21, 2020, 08:32 IST
జీవితంలో మరోసారి బిగ్‌బాస్‌ చూసేది లేదని, కంటెస్టెంట్లకు ఓట్లు వేయమని తెగేసి చెప్తున్నారు.
21-12-2020
Dec 21, 2020, 01:32 IST
సాక్షి, హైదరాబాద్‌: బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌–4 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం ముగిసింది....
21-12-2020
Dec 21, 2020, 00:52 IST
పెద్ద హీరోల‌ది పెద్ద మ‌న‌సని చాటి చెప్పారు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే సాక్షిగా కంటెస్టెంట్ల...
20-12-2020
Dec 20, 2020, 20:55 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ ట్రోఫీ కోసం పంతొమ్మిది మంది పోటీ ప‌డ‌గా ఫినాలేకు ఐదుగురు చేరుకున్నారు. వీరిలో హారిక మొద‌ట...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top