‘లవ్‌’లో పోటీపడి నటించాం | Bharath And Vani Bhojan Talk About Love Movie | Sakshi
Sakshi News home page

‘లవ్‌’లో పోటీపడి నటించాం

Dec 8 2022 9:40 AM | Updated on Dec 8 2022 9:40 AM

Bharath And Vani Bhojan Talk About Love Movie - Sakshi

లవ్‌ చిత్రంలో తాను, నటి వాణిభోజన్‌ పోటీ పడి నటించినట్లు హీరో భరత్‌ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటిస్తున్న 50వ చిత్రం లవ్‌. నటి వాణి భోజన్‌ నాయకిగా నటిస్తున్న ఇందులో వివేక్‌ ప్రసన్న, రాధాదేవి, బిగ్‌బాస్‌ డేనియల్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్పీ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ మంగళవారం సాయంత్రం చెన్నైలో చిత్ర టీజర్‌ను ఆవిష్కరించింది.

వాణి భోజన్‌ మాట్లాడుతూ ఇంతకు ముందు భరత్‌ సరసన మిరల్‌ చిత్రంలో నటించానని, మళ్లీ ఇప్పుడు లవ్‌ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో నటించడానికి అవకాశం ఉన్న పాత్ర లభించిందని చెప్పారు. నటుడు భరత్‌ మాట్లాడుతూ ఇది తన సొంత సంస్థ లాంటిదన్నారు. హీరోయిన్‌ది కూడా ప్రధాన్యత కలిగిన పాత్ర అని తెలిపారు. ఇంతకుముందే మిరల్‌ చిత్రంలో వాణి భోజన్‌తో కలిసి నటించానన్నారు. మళ్లీ అదే కాంబినేషన్‌ అంటే ప్రేక్షకులు ఎలా భావిస్తారో అన్న సందేహం కలిగిందన్నారు. ఆమెకు తన పాత్ర నచ్చడంతో నటించడానికి అంగీకరించినట్లు తెలిపారు. చిత్రంలో ఇద్దరూ పోటీపడి నటించినట్లు చెప్పారు. ఇది యుక్త వయసులో పెళ్లి చేసుకున్న      యువతీ యువకులందరూ రిలేట్‌ చేసుకునే కథా చిత్రంగా ఉంటుందన్నారు. లవ్‌ తన 50వ చిత్రం కావడం సంతోషంగా ఉందన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement