బాబుకు జన్మనిచ్చిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రెండో భార్య | Basheer Bashi Second Wife Mashura Gave Birth, Announced by First Wife Suhana | Sakshi
Sakshi News home page

Basheer Bashi: బాబుకు జన్మనిచ్చిన బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ రెండో భార్య, సంతోషంలో మొదటి భార్య

Feb 26 2023 6:05 PM | Updated on Feb 26 2023 6:43 PM

Basheer Bashi Second Wife Mashura Gave Birth, Announced by First Wife Suhana - Sakshi

ఈ గుడ్‌న్యూస్‌ను అతడి మొదటి భార్య సుహానా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం విశేషం. మశూరాకు బాబు పుట్టాడు.

మలయాళ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, మోడల్‌ బషీర్‌ బశి మరోసారి తండ్రయ్యాడు. బషీర్‌ రెండో మశూరా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఈ గుడ్‌న్యూస్‌ను అతడి మొదటి భార్య సుహానా సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం విశేషం. 'మశూరాకు బాబు పుట్టాడు. తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారు. మీ ఆశీర్వాదాలు మాపై అలానే ఉంచండి' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు సుహానా తన కొడుకును చూసి ఎమోషనలైన ఫోటోను జత చేసింది.

ఇది చూసిన సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆమె గర్భం దాల్చినప్పటి నుంచి పురిటి నొప్పుల దాకా ప్రతీది అభిమానులతో చెప్పుకొచ్చిందీ కుటుంబం. తాజాగా అప్పుడే పుట్టిన బాబును చూపిస్తూ యూట్యూబ్‌లో వీడియో రిలీజ్‌ చేయగా అది వైరల్‌గా మారింది. మరోవైపు అతడి పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేశారు. ఇకపోతే బషీర్‌ బిగ్‌బాస్‌ మలయాళం తొలి సీజన్‌లో పాల్గొన్నాడు. సూర్యజోడి నెంబర్‌ 1 అనే ప్రోగ్రామ్‌లో తన ఇద్దరు భార్యలతో కలిసి పార్టిసిపేట్‌ చేశాడు. బషీర్‌ 2009లో సుహానాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. 2018లో బషీర్‌ మశూరాను రెండో పెళ్లి చేసుకున్నాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement