
వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోహీరోయిన్లుగా చేసిన సినిమా 'వన్ బై ఫోర్'. టెంపర్ వంశీ, ఆర్ఎక్స్ 100 కరణ్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా సినిమాకు 'బాహుబలి'కి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన పళని దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
(ఇదీ చదవండి: చెల్లి నిశ్చితార్థంలో టాలీవుడ్ స్టార్ సింగర్ మధుప్రియ)
షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధమైంది. సెప్టెంబరులో థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. వన్ బై ఫోర్.. ఓ యాక్షన్ క్రైమ్ డ్రామా. నోరు జారితే జరిగే పరిణామాలు, వాటి వల్ల వచ్చే సమస్యలు ఎలా ఉంటాయో చెప్పే కథే ఈ సినిమా. టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది అని నిర్మాతలు చెప్పారు.
(ఇదీ చదవండి: 'కింగ్డమ్' కోసం కొత్త విలన్.. ఇతడెవరో తెలుసా?)