
చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆచార్య’. కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. నిర్మించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు చరణ్. ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా ఎవరు నటిస్తారు? అనేది ఇప్పటివ రకూ తెలియలేదు. తాజాగా ‘ఆచార్య’ను ఢీ కొనేది అరవింద్ స్వామి అని తెలిసింది. మెయిన్ విలన్ పాత్రలో ఆయన నటించనున్నారని సమాచారం. రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా అరవింద్ స్వామి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో జాయిన్ అవుతారట. ఈ సినిమాలో చిరంజీవి ఉద్యమకారుడిగా, రామ్‌చరణ్ విద్యార్థి నాయకుడిగా కనిపిస్తారట. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.