Raashi Khanna Says Artist Life Seems a Bit Difficult but I Like It - Sakshi
Sakshi News home page

అది కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే: రాశిఖన్నా

Mar 27 2022 7:30 AM | Updated on Mar 27 2022 9:53 AM

Artist Life Seems A Bit Difficult But I like It, Raashi Khanna Says - Sakshi

సరిగ్గా నిద్రపోయేంత సమయం కూడా ఉండటం లేదు.

నిద్రపోవడానికి కూడా సమయం లేనంత బిజీగా ఉంటున్నారు రాశీ ఖన్నా. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ‘యోధ’ సినిమా షూటింగ్‌ షెడ్యూల్‌లో రాశీ పాల్గొంటున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. దర్శక ద్వయం సాగర్, పుష్కర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాశీతో పాటు దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబరులో రిలీజ్‌ కానుంది.

ఇక ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అవ్వడానికి ముందు తమిళ చిత్రం ‘సర్దార్‌’ షూట్‌లో పాల్గొన్నారు రాశీ. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కార్తీ హీరో. ఈ సినిమా నైట్‌ షూట్‌ను ముగించుకుని ‘యోధ’ సినిమా షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు రాశీ ఖన్నా. ‘‘సర్దార్‌’ నైట్‌ షూట్స్‌ను కంప్లీట్‌ చేసిన వెంటనే ఢిల్లీలో జరుగుతోన్న ‘యోధ’ డే షూట్స్‌లో జాయిన్‌ అయ్యాను. సరిగ్గా నిద్రపోయేంత సమయం కూడా ఉండటం లేదు. ఆర్టిస్ట్‌ లైఫ్‌ కాస్త కష్టంగా అనిపించినా నాకు ఇష్టమే’’ అని పేర్కొన్నారు రాశీ ఖన్నా. ఇక  తెలుగులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేసిన గోపీచంద్‌ ‘పక్కా కమర్షియల్‌’, నాగచైతన్య ‘థ్యాంక్యూ’ చిత్రాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement