సంక్రాంతి బరిలో అరణ్య

Aranya Movie Motion Poster Release - Sakshi

రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. తెలుగులో ‘అరణ్య’గా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళ్‌లో ‘కాడన్‌’ పేరుతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్‌ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రభు సాల్మన్‌ దర్శకత్వంలో ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మించింది. 25 ఏళ్లుగా అడవిలో జీవిస్తున్న ఓ మనిషి కథ ‘అరణ్య’. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దృష్టి పెట్టి తీసిన చిత్రమిది. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన నూతన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రానాతో పాటు విష్ణు విశాల్‌ కనిపిస్తున్నారు. జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్‌ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శంతను మొయిత్రా, కెమెరా: ఎ.ఆర్‌. అశోక్‌ కుమార్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top