Sunil Dutt: గ్యారేజీలో అనిల్‌ కాపురం.. హీరోయిన్‌తో సునీల్‌ దత్‌ లవ్‌స్టోరీ..

Anil Kapoor Life style, Sunil Dutt Love Story, Many More Interesting Bollywood News - Sakshi

ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్‌లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే!

ఆమె ముత్తాతే...
పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ నిర్మాణానికి బాలీవుడ్‌ నటి.. కల్కి కొచ్లిన్‌ ముత్తాత మోరిస్‌ కొచ్లిన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ అట. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన.

గొంతు బాలేదని..
గబ్బర్‌ సింగ్‌ తెలుసు కదా.. పవన్‌ కళ్యాణ్‌ కాదు, ‘షోలే’ గబ్బర్‌ సింగ్‌.. అమ్జద్‌ ఖాన్‌!  ఆ సినిమాలో  ఆ పాత్రకు అమ్జద్‌ ఖాన్‌ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్‌ రైటర్‌ జావేద్‌ అఖ్తర్‌కు నచ్చలేదుట. గబ్బర్‌ సింగ్‌ రోల్‌కు సరిపడా స్వరం అమ్జద్‌కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్‌ సిప్పీ దాదాపుగా అమ్జద్‌ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్‌జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్‌ను తీసుకున్నారు. అమ్జద్‌ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్‌ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్‌గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్‌ సింగ్‌ పాత్రను రక్తి కట్టించాడు.

గ్యారేజ్‌లో కాపురం..
బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్‌ కపూర్‌ వాళ్లింటి కారు గ్యారేజ్‌లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట.

నోట్లోంచి మాట రాలేదు..
రాజ్‌ కపూర్, నర్గిస్‌ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్‌ మీద సునీల్‌ దత్‌కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్‌ దత్‌ సిలోన్‌ రేడియోలో ఆర్‌జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్‌ దత్‌ టాప్‌ మోస్ట్‌ హీరోయిన్‌. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్‌ దత్‌. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్‌ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్‌ అయిపోయింది. ఆ పాజ్‌ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్‌ చేస్తే సునీల్‌ దత్‌ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్‌ ఇండియా’లో నర్గిస్‌కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. 

సైఫ్‌ అలీ ఖాన్‌కు రావాల్సింది..
దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్‌ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్‌ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్‌ మీద మాత్రం షారుఖ్‌ ఖాన్‌ కనబడ్డాడు.

చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా
సండే ఫ్లాష్‌బ్యాక్‌: పాత సినిమాకెళ్తాం నాన్నా!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top