breaking news
amjad khan
-
షోలే... అప్పుడది... తుపాన్ ఇండియా
సినిమా మొత్తం రెండు జతలకు మించి వాడని హీరోలు.. హీరోయిన్ ఏమో టాంగేవాలీ.. ఇంకో హీరోయిన్ వితంతువు.. ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టుకు రెండు చేతులూ ఉండవు.. విలన్‌కు గట్టిగా చూస్తే 20 మందికి మించి గ్యాంగ్ లేదు.. లొకేషన్ ఉత్త రాళ్లదిబ్బలు.. ఇవాళ్టి పాన్ ఇండియా సినిమాలతో పోల్చి చూస్తే ఈ లక్షణాలతో ఏదైనా సినిమా సూపర్ హిట్ అవుతుందా? అవుతుంది.. అయ్యింది.. అవుతూనే ఉంది.. ‘షోలే’ – ఒక ప్రెజెంట్ కంటిన్యుయెస్ టెన్స్ 50 ఏళ్లుగా ‘షోలే’ లిఖించిన రికార్డులు ఎన్నో. చెప్పిన కొటేషన్లు మరెన్నో. ‘జో డర్ గయా.. సమ్ఝో మర్గయా’.. మరణమే లేని షోలేతో ప్రేక్షకుల వీడని దోస్తీ గురించి ప్రత్యేక కథనం..‘పుష్ప’ సినిమా రెండు పార్ట్‌లుగా వచ్చి కోట్లు సంపాదించింది. ఒక గంధపు చెక్కల స్మగ్లర్ హీరోనా అని ఒకరిద్దరు క్వశ్చన్ చేశారు. కాని సగటు జనం జానేదో అని సూపర్‌హిట్ చేశారు. ఈ సగటు జనం ఇక్కడి వరకూ చేయడానికి చాలా మెట్లు పడ్డాయి. వాటిలో ‘షోలే’ (Sholay Movie) ఒకటి.సలీమ్–జావేద్ హిందీలో యాంగ్రీ యంగ్మేన్ను తెచ్చారు. అంటే స్వాతంత్య్రం వచ్చాక జన్మించి, యుక్త వయసు వచ్చేనాటికి అంటే 1970ల నాటికి దేశ స్థితి చూస్తే ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, బ్లాక్ మార్కెట్. రోజులు ఇలా ఉంటే అమ్మాయి వెంట పరిగెత్తి విరహగీతాలు పాడే హీరో చెల్లుబాటు కాడు అని వాళ్లు కోపంగా ఉండే హీరోని తెచ్చారు. ‘జంజీర్’లో అమితాబ్ అలాంటి హీరో. ఇతను ఇన్స్పెక్టర్గా ఉంటూ కూడా తన తల్లితండ్రులను చంపినవాణ్ణి చట్టప్రకారం శిక్షించలేకపోతాడు. యూనిఫామ్‌ను వదిలాకే పగ సాధిస్తాడు. చట్టానికి ఆవల కొన్ని పనులు చేసే హీరోలు అలా పుట్టుకొచ్చారు. ఆ తర్వాత ‘దీవార్’ వచ్చింది. కష్టపడి పని చేసే హీరోకు బదులు అడ్డదారిలో స్మగ్లర్‌గా మారే హీరోగా కనిపిస్తాడు అమితాబ్. సినిమాలో నిజాయతీపరుడైన శశికపూర్ (Shashi Kapoor) ఉన్నా అందలానికి ఎదిగిన అమితాబ్‌ను ఆరాధిస్తాడు ప్రేక్షకుడు. ఈ వరుసలోనే వచ్చింది ‘షోలే’. ఇక్కడ అత్యంత దుర్మార్గుడైన గబ్బర్ సింగ్‌ను సంహరించడానికి ఇద్దరు చిల్లర దొంగలను కాంట్రాక్ట్ మీద పట్టుకొస్తాడు ఊరి పెద్ద ఠాకూర్. చిల్లర దొంగల్లో వీరత్వం ఉండటం, కొంచెం మానవత్వం ఉండటంతో మేలు చేయని పోలీసుల కంటే కొద్దిగా కీడు చేసే చిల్లర దొంగలే నయం అనుకుంటారు రామ్‌గఢ్ వాసులు, తద్వారా ప్రేక్షకులు. ఆ విధంగా సకల సద్గుణ శోభితుడైన హీరోకు నూకలు చెల్లుతూ వచ్చి ‘పుష్ప’ వరకూ అతడు రూపాంతరం చెందాడు.‘షోలే’ కథ అంతా రెండు లైన్లలో చె ప్పొచ్చు. గొప్ప కథలు ఏవంటే కట్టె కొట్టె తెచ్చె అన్నట్టుగా చెప్పగలిగేవే. పోలీస్ ఆఫీసర్ ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ చంపేశాడు. ఆ ప్రాంతానికి పీడగా మారాడు. వాణ్ణి చంపడానికి ఠాకూర్ ఇద్దరు దొంగలను కిరాయికి తెచ్చాడు. అంతే కథ. ఈ కథను మూడున్నర గంటల పాటు 70 ఎం.ఎం స్క్రీన్ మీద దర్శకుడు, నటీనటులు, రచయితలు, కెమెరామేన్, సంగీత దర్శకుడు ఎలా చూపారనేదే అసలు సంగతి. వాళ్లు ఎలా చూపారంటే అలా మరెవరూ, మరెప్పుడూ చూపలేకపోయారు. అందుకే షోలే అంటే షోలే. ఇలాంటి సినిమాలు సర్పాల తలలపై మణుల వంటివి. రీమేక్‌లని ప్రయత్నిస్తే మణులు రాళ్లయిపోతాయి. లేదా పాము కాటు తప్పదు. అందుకే ‘షోలే’ను మళ్లీ మళ్లీ ముస్తాబు చేసి వదిలారు తప్ప రీమేక్ అంటే జనం తుపాకులు తీశారు.‘షోలే’ యాక్షన్ సినిమా అనుకుంటారు. ఫక్తు కుటుంబ కథా చిత్రం. కుటుంబమే దీనికి ఆధారం. ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ గాడు కాల్చి చంపాడు. కుటుంబం కోల్పోతే మనిషికి ఉండే బాధతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అవుతాడు. ఆ రోజుల్లో మగవారి ఎర్లీ డెత్స్ వల్ల ప్రతి ఇంటా ఒక వితంతువు ఉండేది. జయభాదురి (Jaya Bhaduri) వేసిన రాధ పాత్రను ప్రేక్షకులు పోల్చుకున్నారు. భర్త పోయిన ఎన్నో ఏళ్లకు ఆమె ‘జయ్’ అనే అమితాబ్‌ను చూసి మళ్లీ అతనితో కుటుంబాన్ని నిర్మించుకోవచ్చేమో అని ఆశ పడుతుంది. ఆ ఆశ ప్రేక్షకులకు తెలుసు. ఆమెకో కుటుంబం ఏర్పడాలని వారూ అనుకుంటారు. జరగదు. జయ్ చనిపోతాడు. ప్రేక్షకులు అక్కడా కనెక్ట్ అవుతారు. ఏ తాడూ బొంగరం లేని వీరూ అను ధర్మేంద్ర టాంగేవాలీతో సరసం చేసి సాధించుకుంది మౌసీతో పాటు ఒక కుటుంబాన్నే కదా! ఇక కథలో ఇమామ్ గారి కుటుంబానికి వచ్చిన బాధ ఎవరు మరుస్తారు. చేతికి ఎదిగొచ్చిన కొడుకు పట్నం పోయి సంపాదిస్తాడనుకుంటే తండ్రిని ఏకాకిని చేసి గబ్బర్ చేతుల్లో ప్రాణాలు కోల్పోతాడు. కుటుంబం ఉనికే భారతదేశ సమాజపు ఉనికి. ఇన్ని కుటుంబాల ఉద్వేగాల అల్లిక కాబట్టే ‘షోలే’ ఆడింది. ఆడుకుంది.‘షోలే’ ప్రివ్యూ కోసం థియేటర్లో కూచున్న రాజ్‌కపూర్ (Raj Kapoor) సినిమా మొదలైన పది నిమిషాల్లోనే మొదలయ్యే ట్రైన్ రాబరీ సీక్వెన్స్ చూసి చకితుడయ్యాడు. ‘ఇదేంటి... క్లయిమాక్స్‌ను ముందే పెట్టేశారు’ అన్నాడట పక్కనున్న వారితో. అవును ‘షోలే’ క్లయిమాక్స్ ముందే వచ్చేస్తుంది... అంత భారీగా. ఆ తర్వాత ‘షోలే’ను కేవలం సన్నివేశాల బలం మీద నడుపుతారుగాని యాక్షన్ మీద కాదు. ‘షోలే’ క్లయిమాక్స్ కేవలం ఠాకూర్, గబ్బర్ సింగ్‌ల మీదే! చేతుల్లేని ఠాకూర్ చేతులు తెగ్గొట్టే గబ్బర్‌తో తలపడతాడు. ఇలా స్క్రీన్‌ప్లే రాసిన ‘షోలే’ ఆడిందంటే ఏమిటి మర్మం! అదేమిటో ఎవరూ చెప్పలేరు. చెప్పినా కొంతే. రొంతే. అంతంతే. షోలేకు వ్యాఖ్యానం లేదు.1973లో మొదలెట్టి రెండేళ్ల పాటు తీశారు ‘షోలే’. కార్పెట్లు అమ్మి, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ చేసి సంపాదించిన డబ్బును కొడుక్కు ఇచ్చి సినిమా చేయమన్నాడు నిర్మాత జి.పి.సిప్పీ. కోటి రూపాయల సినిమా! వస్తే చాలా డబ్బులు రావాలి పోతే కోటి అన్నాడు. అందుకు తగ్గ కథ రమేష్ సిప్పీ రాయించుకున్నాడు సలీమ్ జావేద్‌లతో! అతని వేడి చూసి – వాళ్లు కూడా రంగంలో దిగారు. ‘లోహా గరమ్ హై... మార్ దో హథోడా’ (ఇనుము వేడి మీద ఉన్నప్పుడే సమ్మెట పోటు పడాలి) అనుకున్నారు. ఠాకూర్, గబ్బర్ సింగ్‌ల మధ్య ఇద్దరు దొంగలను ప్రవేశపెట్టి కథ అల్లారు. దీనికి ప్రేరణ అకిరా కురసావా ‘సెవన్ సమురాయ్’, మనం తీసిన ‘మేరా గావ్ మేరా దేశ్’... ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి. అన్నీ తీసుకుని మనది ఇవ్వడం కూడా విద్యే. ఆ విద్యతో తయారైన ఈ కథకు ద్వారకా దివేచా కెమెరా, రామ్ యెదేకర్ ఆర్ట్ డైరెక్షన్, ఎం.ఎస్.షిండే ఎడిటింగ్, ఆర్.డి.బర్మన్ సంగీతం... గంధపు చేతులకు మల్లెలు చుట్టాయి. మరి రమేష్ సిప్పీ ఇంత మంచి టేకింగ్‌ను ఎలా సాధించాడో అతనికే తెలియాలి. ధర్మేంద్ర, అమితాబ్, అంజాద్ ఖాన్, సంజీవ్ కుమార్, హేమ మాలిని, జయభాదురి... ఎవరికి ఎవరు తక్కువ. సత్తువ చూపడం వారికి మక్కువ.‘షోలే’లో ప్రతి సన్నివేశానికి, ప్రతి ఫ్రేమ్‌కు అభిమానులున్నారు. అందులోని ప్రతి చిన్న పాత్రకూ అభిమానులున్నారు. జైల్లో గూఢచారిగా పని చేసే బార్బర్ హరిరామ్, పిరిమిగా కట్టెలు అమ్మే సూర్మా భూపాలి, నమక్ తినే కాలియా, గబ్బర్‌కు బదులు పలికే సాంబా, హిట్లర్ జైలర్, ఠాకూర్ నమ్మినబంటు రామ్‌లాల్, పిల్లనిచ్చేందుకు ధర్మేంద్ర గుణగణాలు ఆరాతీసే మౌసీ, ‘మెహబూబా’ పాటలో మెరిసిన జలాల్ ఆగా... ప్రతి ఒక్కరూ... సినిమాను ధన్యం చేశారు... ధన్యులయ్యారు. ప్రేమ నాటకం కోసం వాటర్ ట్యాంకర్ ఎక్కిన ధర్మేంద్ర ‘చక్కీ పీసింగ్’ (తిరగలి తిప్పింగ్) అంటాడు. ప్రేక్షకులు నవ్వుతారు. ‘సూసైడ్’ అంటే ఆత్మహత్య అని ధర్మేంద్ర వల్లే జనానికి ఇంగ్లిష్‌లో తెలిసింది.‘షోలే’ తన శబ్దాలతో కూడా మనకు కనెక్ట్ అవుతుంది. రైలు కూతా, గుర్రపు డెక్కల చప్పుడు, జట్కా మువ్వలు, అజాన్, దూది ఏకే కవాను, కమ్మరి మోత... ఇక ఈ సినిమాకు ముందు రివాల్వరు, రైఫిలు పేలితే అలాంటి సౌండ్ వస్తుందని ప్రేక్షకులకు తెలియదు. బ్రిటిష్ స్టంట్‌మెన్ ఈ సినిమాకు స్టంట్ కొరియోగ్రాఫర్లుగా పని చేశారు. ట్రైన్ రాబరీలో ఒక బుల్లెట్ తగిలి గూడ్సు పెట్టెకు అంటించిన సర్కారు కాగితం చిట్లుతుంది. అలాంటి ఒక్క షాటు తర్వాతి కాలంలో తీయలేకపోయారు.‘షోలే’ గొప్పతనం తెల్లార్లు చెప్పుకోవాలి. గబ్బర్ సింగ్ (Gabbar Singh) పేరు వాడుకుని ఒక హిట్ సినిమా తీసుకున్న మనం ‘షోలే’ యాభై ఏళ్ల సందర్భంగా ఉత్సవం తప్పక చేసుకోవాలి. ఈ సినిమాను తిరగేసి గుహనాథన్ కథ చెప్తే బాగుందని రామానాయుడు గారు ‘కక్ష’ తీశారు. ఇందులోని కొన్ని సీన్లు దర్శకేంద్రుడి ‘అడవి రాముడు’కు పనికి వచ్చాయి. ‘షోలే’ ఎందరినో డైరెక్టర్లు అయ్యేలా చేసింది. రైలుతో మొదలయ్యి రైలుతో ముగిసే ఈ సినిమా భారతీయ ప్రేక్షకులతో యాభై ఏళ్ల ప్రయాణం చేసింది. ఇంకో యాభై ఏళ్లు ఇకపై చేస్తుంది.ఏ దోస్తీ హమ్ నహీ తోడెంగే తోడెంగే దమ్ మగర్ తేరా సాథ్ న ఛోడెంగె...న ఛోడెంగె...పంచ్ డైలాగ్స్ ఫలానా దర్శకుడు వచ్చాక, ఫలానా రచయిత వచ్చాక ట్రెండ్‌లోకి వచ్చాయి అని ఎవరైనా అంటే నోటితోనే నవ్వబుద్ధవుతుంది. సకల పంచ్ డైలాగ్‌లకు బాప్ ‘షోలే’. అందులో ప్రతి మాటా ఒక పంచ్ డైలాగే. పైగా అవి నిత్య జీవితంలోకి వచ్చేసిన డైలాగులు. కొటేషన్లు. సూక్తులు.→ ఇజ్జత్ కీ మౌత్ జిల్లత్ కీ జిందగీ సే కయీ అచ్ఛీ హై (పరాభవాలతో బతికే కన్నా పరువుతో చావడం మేలు)→ ముఝేతో సబ్ పోలీస్ వాలోంకీ సూరతే ఏక్ జైసీ లగ్ తీ హై(నాకు అందరు పోలీసోళ్ల ముఖం ఒకలాగే కనిపిస్తుంది)→ తేరా క్యా హోగా కాలియా (నీ గతేంది కాలియా)→ తుమ్హారా నామ్ క్యా హై బసంతి? (నీ పేరేంటి బసంతి)→ దామ్ జో తుమ్ చాహో... ఔర్ కామ్ జో మై చాహూ (సొమ్ము మీరు కోరినంత... పని నేను చెప్పినంత) – కె. -
హీరోయిన్ కొడుకుగా నటించి చివరకు ఆమెనే పెళ్లాడిన నటుడు!
ఈ శీర్షిక కింద మీరు చదువుతున్నవి గాలి కబుర్లు కావు. గాసిప్స్లాంటి నిజాలు. కాలక్షేపానికి పనికొచ్చే సంగతులు! నమ్మాల్సిందే! ఆమె ముత్తాతే... పారిస్‌లోని ఈఫిల్ టవర్ నిర్మాణానికి బాలీవుడ్ నటి.. కల్కి కొచ్లిన్ ముత్తాత మోరిస్ కొచ్లిన్ చీఫ్ ఇంజినీర్ అట. న్యూయార్క్‌లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సహా చాలా చారిత్రక కట్టడాలకు పనిచేశాడట ఆయన. గొంతు బాలేదని.. గబ్బర్ సింగ్ తెలుసు కదా.. పవన్ కళ్యాణ్ కాదు, ‘షోలే’ గబ్బర్ సింగ్.. అమ్జద్ ఖాన్! ఆ సినిమాలో ఆ పాత్రకు అమ్జద్ ఖాన్‌ను ఎంపిక చేసినా, స్క్రిప్ట్ రైటర్ జావేద్ అఖ్తర్‌కు నచ్చలేదుట. గబ్బర్ సింగ్ రోల్‌కు సరిపడా స్వరం అమ్జద్‌కు లేదని, గొంతు పీలగా ఉందని పెదవి విరిచాడట. అతని అసంతృప్తిని భరించలేక రమేశ్ సిప్పీ దాదాపుగా అమ్జద్‌ను ఆ సినిమా నుంచి తొలగించే నిర్ణయం తీసేసుకున్నాడు. నిజానికి ఆ పాత్రకు ముందు డానీ డెన్జోంగ్పాను అనుకున్నారట. అతను సరిపోడని.. అమ్జద్‌ను తీసుకున్నారు. అమ్జద్ మీదా అసంతృప్తి రావడంతో.. రమేశ్ సిప్పీ ఇరకాటంలో పడ్డారట. ఏమైతేనేం ఫైనల్‌గా అమ్జదే ఖరారయ్యాడు. న భూతో న భవిష్యతి అన్నంతగా గబ్బర్ సింగ్ పాత్రను రక్తి కట్టించాడు. గ్యారేజ్‌లో కాపురం.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తెలుసు కదా. సినిమా అవకాశాలు కాస్త పెరగడం మొదలయ్యాక అతని కుటుంబాన్ని ముంబైకి తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్లెక్కడ ఉన్నారో తెలుసా? రాజ్ కపూర్ వాళ్లింటి కారు గ్యారేజ్‌లో. తర్వాత ఆర్థికంగా కాస్త కుదుటపడ్డాక ముంబైలోని మధ్యతరగతి వాళ్లుండే ప్రాంతంలోని ఒక గది అద్దెకు తీసుకుని అందులోకి మారారుట. నోట్లోంచి మాట రాలేదు.. రాజ్ కపూర్, నర్గిస్ ప్రేమ ఎంత ప్రాచుర్యం పొందిందో నర్గిస్ మీద సునీల్ దత్కున్న ప్రేమా అంతే ఆరాధ్యనీయమైంది. సినిమాల్లోకి రాకముందు సునీల్ దత్ సిలోన్ రేడియోలో ఆర్జేగా పనిచేశాడు. ఆ సమయంలో నర్గిస్ దత్ టాప్ మోస్ట్ హీరోయిన్. ఆమెను ఇంటర్వ్యూ చేయాలని తహతహలాడాడు సునీల్ దత్. తీరా ఆ అవకాశం వచ్చి.. నర్గిస్ అతని ముందు కూర్చునేటప్పటికి నోట్లోంచి మాట పెగలక తత్తరపడ్డాడట. దాంతో ఆ ఇంటర్వ్యూ క్యాన్సిల్ అయిపోయింది. ఆ పాజ్‌ను చాలా ఏళ్ల తర్వాత కనెక్ట్ చేస్తే సునీల్ దత్ సినిమాల్లోకి వచ్చాడు. ‘మదర్ ఇండియా’లో నర్గిస్‌కు కొడుకుగా నటించాడు. తర్వాత ఆమె జీవిత భాగస్వామి కూడా అయ్యాడు. సైఫ్ అలీ ఖాన్‌కు రావాల్సింది.. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే.. సినిమా ఎంత హిట్టో చెప్పడానికి ఇక్కడ ప్రత్యేకంగా విశేషణాలు పేర్చాల్సిన పనిలేదు. అయితే అందులోని రాజ్ మల్హోత్రా (హీరో) పాత్రకు ముందుగా సైఫ్ అలీ ఖాన్‌ను ఎంపిక చేశారట. ఒకానొక దశలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్‌ను కూడా అడిగారని వార్త. ఏమైందో తెలియదు స్క్రీన్ మీద మాత్రం షారుఖ్ ఖాన్ కనబడ్డాడు. చదవండి: అలాంటి పాత్రను నేనెందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డా సండే ఫ్లాష్‌బ్యాక్: పాత సినిమాకెళ్తాం నాన్నా! -
గబ్బర్ సింగ్ జయంతి.. 10 పవర్ఫుల్ డైలాగ్‌లు
Amjad Khan Birth Anniversary: సినిమాల్లో హీరోల తర్వాత పవర్‌ఫుల్‌గా ఉండే క్యారెక్టర్లు విలన్లవే. వారు ఎంత విలనిజం చూపిస్తే హీరోకు అంత మంచిపేరు వస్తుంది. అలాంటి చాలా మంది విలన్లను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ చూసింది. కానీ అందులో గబ్బర్ సింగ్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాడు. అత్యంత చెడ్డవాడిగా, గొప్ప విలన్‌గా ఎవరైనా ఉన్నారంటే అది నిస్సందేహంగా గబ్బర్ అవుతాడు. ఆ పాత్రలో నటించిన అంజాద్ ఖాన్ తప్ప మరెవరూ ఆ ఐకానికి క్యారెక్టర్‌కు న్యాయం చేయలేకపోయేవారేమో. షోలేలో అతని నటన అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, హేమమాలిని, జయా బచ్చన్, ఇతరులను కనపడకుండా చేసిందంటే అతిశయోక్తి కాదు. అంతటి గొప్ప నటనను కనబర్చిన అంజాద్ ఖాన్ 81వ జయంతి రేపు (నవంబర్ 12). ఆయన జయంతి సందర్భంగా షోలే చిత్రంలో అంజాద్ ఖాన్ కొట్టిన డైలాగ్‌లను ఓసారి గుర్తు చేసుకుందామా. 1. కిత్నే ఆద్మీ తే.. 2. జబ్ తక్ తేరే పైర్ చలేంగే ఉస్కీ సాన్స్ చలెగీ.. తేరే పైర్ రూకే తో యే బందూక్ చలేగీ 3. తేరా క్యా హోగా కాలియా ? 4. జో డర్ గయా.. సమ్జో మర్ గయ 5. యహా సే పచాస్ పచాస్ కోస్ దూర్ గావో మే.. జబ్ బచ్చా రాత్ కో రోతా హై, తో మా కెహెతీ హై బేటే సో జావో.. సోజా నహీ తో గబ్బర్ సింగ్ ఆ జాయేగా 6. హోలీ కబ్ హై.. కబ్ హై హోలీ, కబ్? 7. యే రామ్‌ఘర్ వాలే ఆప్నీ బేటియోంకా కౌన్ చక్కీ కా పిసా ఆతా కిలాతే హై రే? 8. క్యా సమజాకర్ ఆయే తే.. కీ సర్దార్ బహుత్ ఖుష్ హోగా, శెభాషీ దేగా? 9. చే గోలీ ఔర్ ఆద్మీ తీన్.. బహుత్ నయిన్సాఫీ హై యే 10. యే హాత్ హమ్ కో దే ఠాకూర్.. -
బాలీవుడ్ సీనియర్ నటుడు మృతి
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు, చిత్ర నిర్మాత ఇంతియాజ్ ఖాన్(77) కన్నుమూశారు. మంగళవారం ముంబైలో తుదిశ్వాస విడిచారు. అయితే ఆయన మరణానికి కారణాలు ఇంకా తెలియలేదు. ఇంతియాజ్.. నటుడు జయంత్ కుమారుడు అలాగే అంజాద్ ఖాన్ సోదరుడు. ఇంతియాజ్‌కు భార్య కృతికా దేశాయ్(సినీ, టీవి నటి), కూతురు అయేషా ఖాన్ ఉన్నారు. యాదోంకి బారాత్, ధర్మాత్మ, దయావన్, హల్చల్, ప్యార్ దోస్త్, గ్యాంగ్, తదితర సినిమాల్లో నటించిన ఇంతియాజ్ తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు.(బాధ పడుతున్నా.. కానీ తప్పదు: నటి) బాలీవుడ్ నటుడు జావేద్ జాఫ్రీ.. ఇంతియాజ్ ఖాన్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోదరుడితో కలిసి ఉన్న ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ‘నటుడు ఇమ్తియాజ్ ఖాన్ కన్నుమూశారు. అతనితో గ్యాంగ్ సినిమాలో నటించాను. ఇంతియాజ్ ఖాన్ అద్భుతమైన నటుడు. మానవతావాది. భగవంతుడు అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. ఇంతియాజ్ మృతిపై బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. (కరోనా అలర్ట్ : మహేష్‌బాబు సూచనలు) ఇంతియాజ్ ఖాన్, అంజాద్ ఖాన్ -
బీడీ కార్మికుడికి పుట్టిన ‘ఐసిస్’ ఉగ్రవాది
బీడీ కార్మికుడికి పుట్టిన అబు అన్స్ పిల్లల కోసం కడుపుకాల్చుకున్న తండ్రి ‘ఐసిస్’ ఉగ్రవాది కుటుంబ వ్యవహారమిది కీలకంగా మారిన సిటీలో ఖాలిద్ కదలికలు సిటీబ్యూరో: అతడో బీడీ కార్మికుడు... రాజస్థాన్‌లోని ఓ పట్టణంలో సాధారణ జీవితం గడుపుతుంటాడు. తన కుమారులకు బంగారు భవితనివ్వాలని అనునిత్యం తపన పడ్డాడు. చుట్టూ ఉన్న సామాజిక పరిస్థితుల్నీ ‘ధిక్కరించి’ మరీ తన కుమార్తె ఉన్నత విద్యనభ్యసించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. దేశ వ్యాప్తంగా విధ్వంసాలకు కుట్రపన్నుతున్నారనే ఆరోపణలపై ఎన్ఐఏ అధికారులు శనివారం అరెస్టు చేసిన జునూద్-అల్-ఖలీఫా-ఏ-హింద్ సభ్యుడు అబు అన్స్ తండ్రి అంజద్ ఖాన్ వ్యవహారమిది. జైపూర్‌కు 85 కిమీ దూరంలో ఉన్న టోంగ్ పట్టణంలోని మొహల్లా బథ్వాలన్ ప్రాంతానికి చెందిన అంజద్ ఖాన్ ఓ బీడీ తయారీ సంస్థలో కార్మికుడు. ఇలా వచ్చే చిరు ఆదాయంతోనే ముగ్గురు కుమారులు, కుమార్తెకు మంచి జీవితం ఇవ్వాలని భావించాడు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ తన దైనందిన అవసరాలను సైతం తగ్గించుకుంటూ వచ్చాడు. పెద్దవాడైన అబు అన్స్ను జైపూర్‌లోని జేవీసీఆర్సీ యూనివర్సిటీ నుంచి మూడేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేయించాడు. కొన్ని సాఫ్ట్వేర్ కోర్సులు చేయించి ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు పంపాడు. మిగిలిన ఇద్దరు కుమారుల్లో ఒకరు ఇటీవలే బీటెక్ పూర్తి చేయగా... మరొకరు డిగ్రీ తరవాత జైపూర్‌కు వచ్చి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్నాడు. మైనార్టీలు ఎక్కువగా నివసించే మొహల్లా బథ్వాలన్లో యువతులు స్కూలు విద్యను దాటడమే గొప్ప విషయం. అలాంటి అంశాలనూ పట్టించుకోని అంజద్ తన కుమార్తెను సైతం బీఎస్సీ పూర్తి చేయించి, ఉన్నత చదువులకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన అబు తొలుత దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో సైబర్ సెక్యూరిటీకి సంబధించిన క్రాష్ కోర్సులు చేశారు. ఆ తర్వాత అబిడ్స్ గన్‌ఫౌండ్రీ చౌరస్తాలో ఉన్న టెక్నో వరల్డ్ గ్రూప్ (టీడబ్ల్యూజీ) సంస్థలో అప్రెంటీగా చేరారు. అది పూర్తయ్యాక అదే సంస్థలో గతేడాది జూన్ నుంచి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్‌గా పని చేస్తున్నాడు. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో నివసిస్తున్న అబు బాంబుల తయారీకి అవసరమైన పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడని ఎన్ఐఏ ఆరోపించింది. గత నెల 25 నుంచి అబు విధులకు హాజరుకావట్లేదని, అరెస్టు విషయం తెలిసి నమ్మలేకపోయామని సంస్థ నిర్వాహకులు చెప్పారు. ఈ సంస్థ ఓ రాజకీయ ప్రముఖుడికి చెందినదిగా తెలిసింది. కుమారుడు అరెస్టు విషయం తెలుసుకున్న అంజద్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు. అయితే అబు అన్స్ను ఢిల్లీ ఎన్ఐఏ కస్టడీలో ఉన్నట్లు తెలిసుకుని అక్కడకు వెళ్లారు. ఖాలిద్ సిటీకి ఎందుకొచ్చాడు? ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్‌లో గతేడాది చిక్కిన రిజ్వాన్ నిజాముద్దీన్ అలియాస్ ఖాలిద్ కదలికలు హైదరాబాద్‌లో ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. యూపీలోని ఖుషీనగర్ జిల్లా కాల్యాకు చెందిన ఖాలిద్ ముంబైలోని మాల్వనీ ప్రాంతానికి చెందిన నలుగురు యువకుల్ని ఐసిస్ వైపు ఆకర్షించాడనేది ప్రధాన ఆరోపణలు వీరిలో ముగ్గురు సిరియా వెళ్లి తిరిగి వచ్చి పోలీసులకు పట్టుబడగా... మరో యువకుడి ఆచూకీ తెలియలేదు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మహారాష్ట్ర ఏటీఎస్ అధికారులు గతనెల 30న ఖాలిద్‌ను అరెస్టు చేశారు. సాంకేతిక ఆధారాలను విశ్లేంచిన నేపథ్యంలోనే ఇతడి కదలికలు హైదరాబాద్‌లోనూ ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న నిఘా విభాగాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. హైదరాబాద్‌లో ఎన్ఐఏ అరెస్టు చేసిన నలుగురి ఉగ్రవాదులతో ఇతడికి సంబంధాలు ఉన్నాయా? లేక ఇప్పటి వరకు వెలుగులోకి రాకుండా నగరం దాటి సిరియాకు వెళ్లిపోయినట్లు భావిస్తున్న ఐదుగురి అంశానికి సంబంధించిందా? అనే దానిపై దృష్టి పెట్టారు. జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్ ఉగ్రవాదుల్ని మంగళవారం నుంచి కస్టడీలోకి తీసుకోనున్న ఎన్ఐఏ.. హైదరాబాద్‌కు చెందిన వారిని ఈ కోణంలోనూ ప్రశ్నించనుంది. ‘జునూద్’ చీఫ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటూ శుక్రవారం ముంబైలో అరెస్టు అయిన ముదబ్బిర్ ముస్తాఖ్ షేక్‌కు ఖాలిద్‌తో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. -
తాగని విలన్
మరో కోణం గబ్బర్ సింగ్ అసలు పేరు గబ్బర్ సింగ్ కాదని అంజాద్‌ఖాన్ అని తెలియని వాళ్లు ఈ దేశంలో ఇంకా చాలామందే ఉన్నారు. అసలు పేరు కన్నా తెరపేరు జనానికి అంతబాగా పట్టడం అంజాద్ ఖాన్ అదృష్టం (తెలుగులో ‘అంజిగాడు’ అనబడే బాలకృష్ణకు ఆ వైభోగం దక్కింది). గబ్బర్ సింగ్ షోలేలో తాగినట్టుగా కనపడడు. కాని ఆ తర్వాతి చాలా సినిమాల్లో విస్కీగ్లాస్ పట్టుకుని కనిపిస్తాడు. అయితే నిజ జీవితంలో అతడు మద్యం ముట్టడన్న సంగతి చాలామందికి తెలియదు. అంజాద్ మరణానికి అతడు తాగే టీలే కారణం అని అన్నవాళ్లు ఉన్నారు. అంత పిచ్చి అతడికి టీ అంటే. రోజుకు కనీసం ఇరవై ముప్పై కప్పులు అదీ డబుల్ చక్కెరతో తాగేవాడట. కాని చివరి రోజుల్లో కనిపించిన స్థూలకాయానికి కారణం అది కాదు. 1986లో షూటింగ్ కోసం ముంబై నుంచి గోవా వెళుతుంటే అంజాద్‌ఖాన్‌కు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చనిపోవాల్సిన మాటే. అయితే బతికించడానికి ఇచ్చిన మందులు సైడ్ ఎఫెక్ట్స్ చూపి అతణ్ణి స్థూలకాయుణ్ణి చేశాయి. అంత పెద్ద విలన్ స్థూలకాయం వచ్చాక కామెడీ పాత్రలు చేయాల్సి వచ్చింది. అలా ఉన్నా కూడా ఆ ప్రమాదం తాలుకు దుష్ఫలితం అతణ్ణి వెంటాడింది. ఆరేళ్ల తర్వాత హార్ట్ ఎటాక్ రూపంలో బలి తీసుకుంది. చనిపోయేనాటికి అతడి వయసు కేవలం 51. అయితే అతడి ముగ్గురు పిల్లలూ వృద్ధిలోకి వచ్చారు. సినిమా, నాటక రంగాలలో పని చేస్తున్నారు. ఇండస్ట్రీలో వాళ్ల పట్ల ఇంకా ఆదరణ ఉంది. అంజాద్‌కు అమితాబ్ ఆప్తమిత్రుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరూ కలిసి తమ స్నేహానికి గుర్తుగా ‘యారానా’ తీశారు. ఇద్దరూ భయంకరమైన యాక్సిడెంట్లకు గురయ్యారు. కాని అంజాద్ అమితాబ్‌ను ఒంటరివాణ్ణి చేసి వెళ్లిపోయాడు. 1975లో సినిమాకు 50 వేలు తీసుకున్న స్టార్ విలన్ కథ ఇది. -
అసలు గబ్బర్ సింగ్ పాత్ర నేను చేస్తానని అడిగా
షోలే సినిమా స్క్రిప్టు వినగానే.. అందులోని గబ్బర్ సింగ్ పాత్రను తాను చేయాలని అనుకున్నానని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెప్పారు. రచయితలైన సలీం -జావేద్‌లకు తాను అదే విషయం చెప్పానని, కానీ దర్శకుడు రమేష్ సిప్పీ మాత్రం అందుకు ఒప్పుకోలేదని.. తనను 'జై' పాత్రకే ఎంపిక చేశారని అమితాబ్ అన్నారు. వాస్తవానికి గబ్బర్ సింగ్ పాత్రకు తొలుత డానీ డెంజోంగ్పాను అనుకున్నారని, కానీ డేట్స్ కుదరకపోవడంతో అమ్జాద్ ఖాన్‌ను తీసుకున్నారని చెప్పారు. అమ్జాద్‌ను ఆ పాత్రకు సలీం-జావేద్ సూచించారు. అత్యంత భయంకరమైన దోపిడీ దొంగ పాత్ర పోషించిన అమ్జాద్ ఖాన్.. ఆ తర్వాతి కాలంలో టాప్ క్లాస్ విలన్లలో ఒకరిగా మారిపోయారు. అసలు నిజానికి ఆయన ఆ పాత్రను సమర్ధంగా పోషించగలరా.. లేదా అనే అనుమానాలు చాలామందికే వచ్చాయి. కానీ, గబ్బర్ సింగ్ పాత్రలో అమ్జాద్ ఖాన్ పూర్తిస్థాయిలో జీవించారని, ప్రేక్షకులు కూడా భయపడేలా చేశారని బిగ్ బీ చరెప్పారు. తనకు మాత్రం అమ్జాద్ ఖాన్ ఆ పాత్ర చేయడంపై ఎలాంటి అనుమానాలు లేవని స్పష్టం చేశారు. తనను అమ్జాద్ ఖాన్ సరదాగా 'పొట్టోడా' అని పిలిచేవారని, తాను ఆయనను 'బండోడా' అని పిలిచేవాడినని కూడా తెలిపారు.