Suma Kanakala: యాంకర్‌ సుమ గొప్ప మనసు.. ఆ 30 మంది బాధ్యత తనదేనట!

Anchor Suma Adopted 30 Students - Sakshi

తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది యాంకర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ, యాంకర్‌ సుమ మాత్రం పర్మినెంట్‌. సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ అయినా.. టాక్‌ షోలైనా, గేమ్‌ షోలైనా సుమ ఉండాల్సిందే. తెలుగమ్మాయి కాకపోయినా.. తెలుగులో గలగల మాట్లాడుతూ.. సమాయానుకూలంగా పంచ్‌లు వేస్తూ ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కెరీర్‌ బిగినింగ్‌లో పలు సీరియల్స్‌లో నటించిన సుమ.. ఆ తర్వాత నటనకు గ్యాప్‌ ఇచ్చి యాంకర్‌గా మారింది. 

ప్రస్తుతం  తెలుగు బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా రాణిస్తున్న సుమ.. అప్పుడప్పుడు తనలో ఉన్న నటిని కూడా పరిచయం చేస్తుంది. ఆ మధ్య  ఆమె లీడ్‌ రోల్‌లో ‘జయమ్మ పంచాయితీ’ అనే సినిమా చేసింది. అది బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ, నటన పరంగా సుమకు మంచి మార్కులు పడ్డాయి. ఇలా ఒకవైపు యాంకరింగ్‌ మరోవైపు యాక్టింగ్‌తో ఇప్పటికీ ఫుల్‌ బిజీగా ఉంది సుమ. ఇదిలా ఉంటే తాజాగా సుమ చేసిన ఓ మంచి పనికి నెటిజన్స్‌ ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

తాజాగా సుమ చెన్నై లోని ఒక కాలేజ్ కు వెళ్లారు. అక్కడి విద్యార్థులతో ఆమె ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నాకు 15 ఏళ్ల వయసున్నప్పుడు యాంకరింగ్ మొదలుపెట్టాను. ప్రేక్షకులు నన్ను ఆదరించి ఇంతదాన్ని చేశారు. అందుకే వారి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను.  ‘ఫెస్టివల్స్ ఆఫ్ జాయ్” అనే సంస్థ నా డ్రీమ్‌. 

నాకు వచ్చే దాంట్లో నేను తినడమే కాదు అందరికీ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. నా వంతుగా 30 మంది స్టూడెంట్స్ ని అడాప్ట్ చేసుకుని చదివిస్తున్నాను. వాళ్ళు బాగా సెటిల్ అయ్యే వరకు నేను వాళ్ళతోనే ఉంటాను’అని సుమ చెప్పుకొచ్చింది. సుమ చేస్తున్న మంచి పనిపై నెటిజన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top