Pradeep Machiraju : పెళ్లిపై స్పందించిన యాంకర్‌ ప్రదీప్‌.. ఇదివరకే అయ్యిందంటూ!

Anchor Pradeep Machiraju Respond On His Maraige Goes Viral - Sakshi

తెలుగు టాప్‌ యాంకర్లలో ప్రదీప్‌ మాచిరాజు కూడా ఒకరు. బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదీప్‌ తన యాంకరింగ్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా ప్రదీప్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. ఇటీవలె ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో హీరోగా మారి అలరించాడు.

ఇదిలా ఉండగా కొంతకాలంగా యాంకర్‌ ప్రదీప్‌ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని, పొలిటికల్‌ లీడర్‌ కూతురితోనే అతని వివాహం అని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.గతంలో కూడా అతని పెళ్లిపై రకారకాల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ షోలో భాగంగా తనని తాను ఇంటర్వ్యూ చేసుకున్న ప్రదీప్‌ ఊతపదం ఏంటని అడగ్గా.. నీ యంకమ్మ అని సమాధానమిచ్చాడు.

మీకు నిజంగా పెళ్లయిపోయింది కదా? అని అడగ్గా.. నాలుగైదుసార్లు అయిపోయింది, యూట్యూబ్ లో చూడలేదా నువ్వు అని తనపై తానే కౌంటర్స్ వేసుకున్నాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top