
Amitabh Bachchans Staff Tests Positive For Covid-19: బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ ఇంట్లో మరోసారి కరోనా కలకలం రేగింది. ఇప్పటికే ఇండియాలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ముంబైలోని అమితాబ్ ఇంట్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా సోకింది. బిగ్‌బీ ఇంట్లో మొత్తం 31 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో ఒకరికి పాజిటివ్ అని తేలింది. మిగిలిన వారందరికి నెగిటివ్ వచ్చింది.
అయితే అతని నుంచి ఇంకెంత మందికి కోవిడ్ సోకిందన్నది తేలాల్సి ఉంది. కాగా గతేడాది జులై11న బిగ్‌బీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు అభిషేక్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య సైతం కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా మరొసారి బిగ్‌బీ ఇంట్లో కరోనా టెన్షన్ మొదలైంది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్‌బీ చేతిలో బ్రహ్మస్త్ర, గుడ్ బై, మేడేతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి.