భవిష్యత్తులోకి తీసుకెళ్తా

Amazon announces Prime Original series with Akshay Kumar - Sakshi

వెబ్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నట్టు గతంలో ప్రకటించారు అక్షయ్‌ కుమార్‌. అమేజాన్‌ ప్రైమ్‌ తెరకెక్కించనున్న ఓ యాక్షన్‌ సిరీస్‌ ద్వారా వెబ్‌ ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తున్నారాయన. ‘ది ఎండ్‌’ పేరుతో తెరకెక్కే ఈ సిరీస్‌ కథాంశం ప్రత్యేకంగా ఉండబోతోందట. భవిష్యత్తు నేపథ్యంలో జరిగే కథ ఇదని, భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయని సమాచారం. ఈ సిరీస్‌ను నాలుగైదు దేశాల్లో చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇందులో గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్‌ భారీగా ఉంటాయట. వచ్చే ఏడాది చివర్లో ఈ సిరీస్‌ సెట్స్‌ మీదకు వెళ్లనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సిరీస్‌ కోసం అక్షయ్‌ కూడా భారీ పారితోషికం తీసుకున్నారని టాక్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top