అల్లు అర్జున్‌ సతీమణి స్నేహ సరికొత్త రికార్డు

Allu Arjun Wife Sneha Hits 4 Million Followers On Instagram - Sakshi

Allu Arjun: అల్లు అర్జున్‌ సతీమణి అల్లు స్నేహ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. బన్నీతో పాటు తన పిల్లలు అయాన్‌, అర్హలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఆమె షేర్‌ చేసిన వీడియోలు, ఫోటోలు వైరల్‌ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే ఆమెకు సోషల్‌ మీడియాలో ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది.

తాజాగా అల్లు స్నేహ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. టాలీవుడ్‌లో ఏ హీరో భార్యకు లేనంత మంది ఫాలోవర్స్‌ని ఆమె సంపాదించుకున్నారు. ఇప్పటివరకు ఇన్‌స్టాలో ఆమె 4 మిలియ‌న్స్‌కి పైగా ఫాలోవర్స్‌తో దూసుకెళ్తున్నారు. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇంతమంది ఫాలోవర్స్‌ని సంపాదించుకోవడం విశేషం. అల్లు స్నేహ తర్వాత రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన 3.3 మిలియన్స్‌, మహేశ్‌బాబు భార్య నమ్రత  2 మిలియన్స్‌  ఫాలోవర్స్‌లో రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.

చదవండి: కాజల్ డేరింగ్ స్టెప్.. పెళ్లి తర్వాత వేశ్య పాత్రలో ‘చందమామ’!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top