చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌ | Allu Arjun Attend At Chikkadpally Police Station In Sandhya Theatre Case, More Details Inside | Sakshi
Sakshi News home page

చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌

Jan 5 2025 9:51 AM | Updated on Jan 5 2025 1:22 PM

Allu Arjun Attend At Chikkadpally Police Station

సంధ్య థియేటర్‌  తొక్కిసలాట కేసులో చిక్కడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు అల్లు అర్జున్‌ (Allu Arjun) వెళ్లారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు (Nampally Court) ఆయనకు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, పలు షరతులు బన్నీకి న్యాయస్థానం విధించింది. అందులో భాగంగానే నేడు ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పటికే నాంపల్లి కోర్టులో పూచీకత్తు పత్రాలను అ‍ల్లు అర్జున్‌ వ్యక్తిగతంగా వెళ్లి సమర్పించిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్‌కు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు..  రూ.50 వేలు చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలో రెండు నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల (Chikkadpally Police Station) ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని బన్నీకి కోర్టు షరతు విధించింది. ఈమేరకే ఆయన అక్కడికి వెళ్లి సంతకం చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement