ఆలియా.. జాన్వీ... ఫైనల్‌గా ఎవరో?

రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ ప్యాన్ ఇండియా మూవీని ‘దిల్’ రాజు నిర్మించనున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా ఇప్పటికే పూజా హెగ్డే, రష్మికా మందన్నా, కియారా అద్వానీల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా జాన్వీ కపూర్, ఆలియా భట్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీని దక్షిణాది తెరకు పరిచయం చేయడానికి చాలామంది దర్శక–నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే రాజమౌళి ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్) చిత్రంలో రామ్‌చరణ్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసి ‘ఆర్‌ఆర్‌ఆర్’ జోడీని దర్శకుడు శంకర్ రిపీట్ చేస్తారా? లేక జాన్వీని కన్ఫార్మ్ చేసి, కొత్త జోడీని వెండితెరపై చూపిస్తారా? ఆలియా, జాన్వీ కాకుండా మరో హీరోయిన్‌ని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడక తప్పదు.